For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిక్డ్స్ వెజిటబుల్‌ హల్వా

|

Mixed Vegetble Halwa
వెజిటబుల్ హల్వా..ఇది అన్నిరకాల హల్వాల్లోకి డిఫరెంట్ గా తయారు చేయబడినది. ఇలా మిక్డ్స్ వెజిటేబుల్ తో హల్వా చేయడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటిన్స్ అందుతాయి. ఇలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ తో నోటికి రుచికరంగాను, శరీరానికి ఆరోగ్యకరంగాను ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ తురుము: 1cup
సొరకాయ తురుము: 3cups
క్యారెట్, బీట్ రూట్ తరుము: 1/2cup
పంచదార: 3cups
మీగడ: 2cups
చిక్కటి పాలు: 2cups
వెనిల్లా ఎసెన్స్‌: 4drops
నెయ్యి: 1cup
జీడిపప్పు: 5-8
బాదంపప్పు: 5-8
పిస్తాపప్పు: 5-8
కిస్‌ మిస్‌: 8-10

తయారు చేయు విధానం:

1. మొదటగా గుమ్మడి కాయ తురుములో నీరంతా తీసేసి. సొరకాయ తురుము, క్యారెట్, బీట్ రూట్ తురుము విడివిడిగా నేతిలో దోరగా వేయించాలి.
2. తర్వాత వేరే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి అందులో వేయించి పెట్టుకొన్న సొరకాయ, బీట్ రూట్, క్యారెటల్ తురుములను అందులోవేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
3. ఇప్పుడు అందులోనే పాలు పోసి ఉడికించాలి. పాలు మొత్తం ఇంకిపోయాక నీరు తీసేసిన గుమ్మడి తురుము, మీగడ, పంచదార వేసి దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి.
4. ఇలా నెయ్యి పైకి తేలేవరకు స్పూన్ తో తిప్పుతూనే ఉండాలి. తర్వాత వెనిల్లా ఎసెన్స్‌, ఇష్టమైన వాళ్లు మిఠాయి రంగు కూడా వేసుకుని కలియదిప్పాలి.
5. దీన్ని ఒక ప్లేట్‌ లో సమానంగా పొయ్యాలి. దీనిపైన వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌ మిస్‌ చల్లి ముక్కలు కోసుకోవాలి. ఈ హల్వా చాలా రుచిగా వుంటుంది.

English summary

Mixed Vegetble Halwa....| మిక్డ్స్ వెజిటబుల్‌ హల్వా

Mixed vegetables refer to ready to use combination of cut vegetables. When you prepare recipes that include a variety of types of vegetables, you receive the nutritional benefits of each. You will have created not only culinary masterpieces but also foods that work together to increase your health.
Story first published:Saturday, March 31, 2012, 13:13 [IST]
Desktop Bottom Promotion