For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన కోవా పెసరపప్పు హల్వా...

|

Moong Dal Halwa
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
కోవా: 1/2cup
పంచదార: 3/4cup
పాలు: 1/2cup
యాలకుల పొడి: 1/2 tsp
బాదం, పిస్తా, జీడిపప్పు: 5:5:5
కుంకుమపువ్వు: కొద్దిగా
నెయ్యి: 1/2cup

తయారు చేయు విధానము:
1. మొదటగా పెసరపప్పును పెనంలో దోరగా వేయించి కడిగి నీళ్లు పోసి ఆరు గంటలు నాననివ్వాలి. పెసరపప్పును నీళ్లనుండి తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ లో సగం నెయ్యి వేడి చేసి రుబ్బిన ముద్దను నిదానంగా చిన్నమంటపై వేయించాలి. ఇలా వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అంటుకుంటుంది.
3. లేత గోధుమరంగు వచ్చాక వేడి పాలలో పంచదార కలిపి ఈ ముద్దలో వేసి కలపాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి ఉండలు కట్టకుండా, మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. పెసరపప్పు పూర్తిగా ఉడికిన తర్వాత నెయ్యి వదులుతుంది.
4. తర్వాత కోవాను ప్రతి ఇరవై సెకన్స్ ఒకసారి అరకప్పు కోవాను కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిసేటట్లు కలుపుతూనే ఉండాలి.
5. కొద్దిగా పాలు తీసుకొని అందు కుంకుమ పువ్వు వేసి కొద్దిసేపు నానబెట్టి తర్వాత, పెసరపప్పు మిశ్రమంలో కలపాలి అలాగే యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమం అంతా ఎల్లోకలర్లో హల్వాలా తయారవుతుంది.
6. ఫైనల్ గా యాలకులపొడి కలిపి నేతిలో వేయించిన జీడిపప్పు, బాదాం, పిస్తా పప్పు వేసి సర్వ్ చేయాలి. రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు హల్వా తయారైంది. చేసే విధానం సులువైనా, కొంచెం జాగ్రత్తగా చేయాలి.

English summary

Moong Dal Halwa... | రుచికరమైన కోవా పెసరపప్పు హల్వా...

Moong dal halwa is a delicious sweet dish for Navratri. The recipe to make moong dal halwa is lengthy as the dal takes lot of time to cook. Check out this Navratri sweet dish, moong dal halwa recipe.
Story first published:Monday, October 10, 2011, 15:45 [IST]
Desktop Bottom Promotion