For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ రోజ్ ఫిర్ని ఎలా చేయాలో చూసెయ్యండి...

పాలు మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే రోజ్ ఫిర్నీ నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డిం, అంటే ఖీర్, పాయసం, వంటిదమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ

|

పాలు మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే రోజ్ ఫిర్నీ నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డిం, అంటే ఖీర్, పాయసం, వంటిదమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు.

ఇది ముగలైయ్ కుషన్. ఇది ట్రెడిషనల్ రిసిపి, చూడటానికి నోరూరిస్తూ..కలర్ ఫుల్ గా రోజ్ ఫ్లేవర్ తో ఉంటుంది. దీన్ని పిస్తా..బాదాంతో గార్నిష్ చేస్తే మరింత టేస్ట్...మరి ఈ వెరైటీ డిజర్ట్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా..

Gulabi Firni

కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం : 1/2cup
పాలు: 1ltr
పంచదార: 1/2cup
రోజ్ సిరప్: 4tbsp
యాలకుల పొడి: 1/2tsp
బాదం, పిస్తా తురుము: 1tbsp
నీళ్ళు: 1/2cup
గులాబీ రేకులు: కొన్ని (గార్నిష్ కోసం)

తయారు చేయు విధానం:
1. బాస్మతి బియ్యాన్ని ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత నీరు వంపేసి బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత పాలలో తగినంత పంచదార వేసి వేడి చేయాలి. మీడియం మంట మీద బాగా కాచాలి. మద్య మద్యలో కలబెడుతుండాలి.

3. తర్వాత మరిగే పాలలోని రోజ్ సిరఫ్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.

4. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న రైస్ పేస్ట్ ను వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి. తక్కువ మంట మీద ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి.

5. ఇప్పుడు మంట తగ్గించి, ఈ మిశ్రానంతటిని తక్కువ మంట మీద పది నిముషాల పాటు ఉండికించుకోవాలి. పదినిముషాల తర్వాత ఈ మిశ్రం చిక్కబడుతుంది. మంటను పూర్తిగా తగ్గించి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అలా కలియబెడుతూనే ఉండాలి.

6. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, యాలకుల పొడి చల్ల బాగా మిక్స్ చేయాలి.

7. ఇప్పుడు ఈ రోజ్ ఫిర్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.

8. ఇప్పుడు ఈ ఫిర్నినీ డిజర్ట్ బౌల్ లోనికి ట్రాన్స్ ఫర్ చేసి ఫ్రిజ్ లో ఒక గంట పాటు పెట్టాలి.

9. ఒక గంట తర్వాత బయటకు తీసి బాదాం, పిస్తా గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే రోజ్ ఫిర్నీ రెడీ. మదర్స్ డే రోజున మీ మదర్ ను సర్ ప్రైజ్ చేయండి.

English summary

Mother's Day Special: Gulabi Firni | మదర్స్ డే స్పెషల్ రోజ్ ఫిర్ని

Firni is a North Indian dessert made of milk and rice. Indian cuisine is very well known for its variety of rice puddings like kheer, payasam, payesh etc.
Desktop Bottom Promotion