నెయ్యి మురుకులు: వరలక్ష్మి పండుగ స్పెషల్

By Sindhu
Subscribe to Boldsky

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.

కాని ఎక్కువగా చేసుకునేది, అందరికి ఇష్టమైన పిండివంట ఏంటి?అంటే జంతికకే ఎక్కువ ఓట్లు పడతాయంటే అతిశయోక్తి కాదుకదా. ప్రతి తెలుగువారింట ఈ జంతికల గొట్టం ఉండి తీరాల్సిందే మరి. ఇవి తయారు చేసుకున్న తర్వాత దాదాపు పదిరోజులు నిల్వ ఉంటాయి. బియ్యంపిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్యరిత్యా కూడా ఎటువంటి చెడు చేయదు. కాని దంతసిరి కాస్త బలంగా ఉండాలి సుమా...0. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.

Murukulu: Varalakshmi Special

కావల్సిన పదార్థాలు:

బియ్యం పిండి: 4cups

శెనగపిండి: 2cups

కారం: 3tbsp

వాము: 1tsp

తెల్ల నువ్వులు: 2 లేదా 3tbsp

ఉప్పు: రుచికి సరిపడా

జీలకర్ర: 2tbsp

బేకింగ్ సోడా: చిటికెడు

నెయ్యి: 2టేబుల్ స్పూన్లు

నూనె: చిన్న కప్పుతో ఒక కప్పు(పిండిలో కలుపుకోవడానికి)

నూనె : వేగించడానికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో బియ్యం పిండి, శెనగపిండి, బేకిండ్ సోడా, ఉప్పు, కారం, వాము, జీకలర్ర, కొద్దిగా వేడిచేసిన నెయ్యి మరియు నూనె ఒకదానికి తర్వాత ఒకటి వేసుకోవాలి.

2. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

3. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, పిండిని మృదువుగా కలుపుకోవాలి. కలుపుకొన్న తర్వాత పిండి మీద కొద్దిగా నూనె చిలకరిస్తే త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది.

4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో జంతికల గొట్టంలో పిండిని నింపి, తర్వాత ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకొని తర్వాత కాగే నూనెలో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. అంతే నెతి మురుకులు రెడీ. కాస్త శ్రమపడితే రుచికరమైన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే జంతికలు సిద్దమవుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Murukulu: Varalakshmi Special

    Chakli is a popular South Indian snack that is prepared during festivals and other celebrations like weddings, family functions etc.. Learn how to make chakli from the video recipe. Here is a step-by-step procedure in the video on how to make chakli.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more