For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రూమ్‌ కుర్‌ కురే

|

Mushroom Kurkure
కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు: 8
చిక్కటి పాలు: 25grms
జున్ను: 25grms
ఎర్ర క్యాప్సికమ్‌ :10grms
పసుపు క్యాప్సికమ్‌:10grms
గ్రీన్‌ క్యాప్సికమ్‌:10grms
పచ్చిమిరపకాయలు: 5grms
అల్లం: 5grms
ఉప్పు తగినంత
నల్లమిరియాల పొడి: 2grms
మొక్కజొన్న పిండి: 150grms
మైదా: 50 grms
జిలకర్ర: 50grms
నూనె: కావలసినంత

తయారుచేయు విధానం:
1. పుట్టగొడుగులను నీటితో శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
2. వీటికి చిన్న ముక్కలుగా కట్‌ చేసిన క్యాప్సికమ్‌, అల్లం, జున్ను, పచ్చిమిరపకాయలను కలపాలి.
3. మొక్కజొన్న పిండి,మైదాలో కొద్దిగానీళ్లు పోసి ముద్దగా కలుపు కోవాలి.
4. ఈపిండి ముద్దకు కూరగాయలు, పుట్టగొడుగుల మిశ్రమాన్ని కలపాలి.
5. ఆ తరువాత కాగిన నూనెలో వీటిని పకోడీల మాదిరిగా దోరగా వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా పుదీనా సాస్‌ తో తింటే బాగుంటుంది.

Story first published:Monday, October 4, 2010, 12:41 [IST]
Desktop Bottom Promotion