For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగపంచమి స్పెషల్ నువ్వుల లడ్డు

|

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల గింజల్లో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లెవనాయిడ్ ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరయు డైటేరియన్ ఫైబర్ వంటివి ఎన్నో ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

డయాబెటిస్, రొమటాయిడ్ ఆర్థ్రైటిస్, ఓరల్ హెల్త్, జలబు, చుండ్రు, చర్మసమస్యలను తగ్గించే నువ్వులు, ఎంతో బలాన్నిచ్చే జీడిపప్పు, ఖర్జూర, ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, దేవుడికి నైవేద్యంగా సమర్పించే నువ్వుల లడ్డును పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. మరి ఈ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ నువ్వుల లడ్డును ఎలా తయారుచేయాలో చూద్దాం...

Nuvvula Laddu(Til Laddu): For Nagarapanchami

కావలసిన పదార్థాలు:
తెల్ల నువ్వులు - 1cup
బెల్లం: 1/2cup
ఖర్జూరం - 1 cup
ఎండుకొబ్బరి తురుము- 1/4cup
వేరుశెనగపప్పు - 1cup
జీడిపప్పు - 1/2cup
గసగసాలు - 2tbps
ఎండుద్రాక్ష - 1/2cup
యాలకులు - నాలుగు.

తయారు చేసే విధానం :
1. ముందుగా నువ్వులు పాన్ లో వేసి దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి.
2. అలాగే వేరుశెనగపప్పు, గసగసాలు కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. వేయించిన పదార్థాలు చల్లారిన తర్వాత ఈ మూడింటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే యాలకలు, బెల్లం కూడా పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు ఖర్జూరం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
5. తర్వాత ఖర్జూరం ముద్దలో నువ్వులు, గసగసాలు, పల్లీలతో చేసిన పొడి, కొబ్బరి తురుము, యాలకలపొడిని వేసి బాగా కల గలపాలి.
6. అరగంట అలాగే ఉంచి ఉండలుగా చేసుకుంటే నువ్వుల లడ్డులు రెడీ.

English summary

Nuvvula Laddu(Til Laddu): For Nagarapanchami

Nagarapanchami is a festival, that falls on the fifth day of the shravana masa. This year it falls on 19th of August, wednesday. Nagarapanchami is a very scared festival for Hindu all over India. There are certain strict procedures that needs to be followed to perform the festival. One has to wake up early morning and take head bath. And wrap a wet cloth around them and do abhisheka (pour milk ) to the sculpted snake. Followed by turmeric and vermillion.
Story first published: Wednesday, August 19, 2015, 13:24 [IST]
Desktop Bottom Promotion