For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ ఫ్రూట్ కేక్..

|

Orange Fruit Cake
కావలసిన పదార్థాలు:
మైదాపిండి:100grm
వెన్న:100grm
పంచదార పొడి:100grm
చెర్రీస్, కిస్‌ మిస్, టూటీ ఫ్రూటీ ముక్కలు:100grms
కోడిగుడ్లు: 2
బేకింగ్ పౌడర్: 1tsp
పాలపొడి: 2tbsp
ఆరెంజ్ ఎసెన్స్: 1tsp
కమలాపండు తొనలు: 1/2tsp
ఆరెంజ్ ఫుడ్ కలర్: 2 or 3 drops

తయారు చేయు విధానం:
1. మైదాపిండి, బేకింగ్ పౌడర్, పాలపొడి, వెన్న, పంచదార మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి.
2. ఇప్పుడు దీనికి కోడిగుడ్ల సొన, ఆరెంజ్ ఎసెన్స్, ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. ఒకవేళ పిండి మిశ్రమం పలచగా ఉంటే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ గిలకొట్టాలి.
3. తర్వాత అందులో కిస్‌ మిస్, చెర్రీ, టూటీఫ్రూటీ ముక్కలు, కమలాపండు తొనల ముక్కలు వేసి బాగా కలపాలి.
4.తరువాత కేక్ తయారు చేసే పాత్రలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి దాన్ని ఎలక్ట్రిక్ ఓవెన్‌ లో ఉంచి, 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలు బేక్ చేయాలి. అంతే ఆరెంజ్ ఫ్రూట్ కేక్ రెడీ.

Story first published:Tuesday, December 21, 2010, 12:43 [IST]
Desktop Bottom Promotion