For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ పెసరట్టు

|

Palak Pesarattu
కావలసిన పదార్థాలు:
పాలకూర: 5కట్టలు
పెసరపప్పు: 1cup
బియ్యం: 1cup
ఉల్లిపాయలు: 3
టమోటలు: 3
పచ్చిమిర్చి: 6-8
చాట్ మసాలా: 1tsp
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర తురుము: 1cup
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
వెన్న: కొద్దిగా

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం, పెసరపప్పును నాలుగు నుండి ఆరు గంటలసేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్ని చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. దాంతో పాటు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, పచ్చిమిర్చి, టమోటో, ఉప్పు, చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొద్దిగా నీళ్ళు పోసి దోసె పిండిలా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత రుబ్బుకొన్న బియ్యం పిండిలో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ, కొత్తమిర తురుము, పాలాకును సగం..సగం కలిపి పెట్టుకోవాలి.
5. చిన్న బౌల్ తీసుకొని అందులో మిగినల సగం ఉల్లిపాయ తరుగు, కొత్తిమిర తరుగు, చాట్ మసాలను వేసి బాగా మిక్స్ పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి నూనె రాసి వేడయ్యాక పెసర పిండి మిక్స్ పేస్ట్ ను దోసెలా పెనంపైన వేయాలి. తర్వాత వెంటనే దోసె పై ఉల్లిపాయ, చాట్ మసాలా మిశ్రమాన్ని చల్లుకొని కొద్దిగా నూనె వేసుకొని దోసె దోరగా కాలనివ్వాలి. దోసెను ప్లేట్ లోకి సర్వ్ చేసే ముందు కొద్దిగా వెన్న రాసి, హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే పాలక్ పెసరట్టు రెడీ....

English summary

Palak Pesarattu...| పాలక్ పెసరట్టు

Andhra Pesarattu or green moong dal Dosa is a delicious lentil based pancake recipe which is best enjoyed with a spicy ginger chutney.
Story first published:Saturday, May 12, 2012, 16:36 [IST]
Desktop Bottom Promotion