For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లో ఫ్యాట్ పాలక్ పన్నీర్ పఫ్ -హెల్తీ ఈవెనింగ్ స్నాక్

|

పాలక్ పన్నీర్ టేస్టీ రెస్టారెంట్ డిష్. రెస్టారెట్లలో ఈ రెండింటి కాంబినేషన్ తో ఎక్కువగా కర్రీని తయారు చేస్తుంటారు. అయితే పాలకూర, పన్నీర్ తో వెరైటీగా సాండ్ విచ్ స్నాక్ తయారు చేసుకొంటే కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది.

భోజనానికి ముందు, సాయంత్రాలప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. అయితే కొంత మంది నూనెతో తయారు చేసినవి ఇష్టపడరు. అలాంటి వారికోసం ఆరోగ్యకరమైన స్నాక్ ను మీకోసం అందిస్తున్నాం. ఇవి లోఫ్యాట్, మరియు నూనెలో వేయించనివి..మరి పాలక్ పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Palak Puff

కావల్సిన పదార్థాలు:
తరిగిన పాలకూర: 1cup
పన్నీర్ తురుము: 1/2cup
తరిగిన ఉల్లిపాయలు: 1/2cup
వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
అల్లం పేస్ట్: 2tsp
తరిగిన పచ్చిమిర్చి ముక్కలు: 2tsp
ఆలివ్ ఆయిల్: 2tsp
ధనియాలు: 1tsp
పంచదార: 1tsp
నిమ్మరసం: 2tsp
వేరుశెనగ: 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌమీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొన్ని నిముషాల పాటు వేగించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో పాలకూర తరుగును, పన్నీర్ తరుగును కూడా వేసి బాగా వేగించుకోవాలి.
2. అంతకంటే ముందు వేరుశనగలు వేయించి సిద్దంగా ఉంచుకోండి.
3. తర్వాత ఒక కప్పు పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ పంచదార, 1కప్పు పాలు, అర స్పూన్ ఈస్ట్, 1/2 ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకుని పిండి ముద్దను మూడు నాలుగు గంటల పాటు వదిలేయండి.
4. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న రోటీలా తయారుచేయండి.
5. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కర్రీని రోటీలో పెట్టి నాలుగు వైపులా మూసేసి మరిగే నూనెలో వేసి వేయించండి. అంతే తినడానికి పాలక్ పఫ్ రెడీ...

English summary

Palak Puff-Healthy Evening Snack | లో ఫ్యాట్ పాలక్ పన్నీర్ పఫ్ -హెల్తీ ఈవెనింగ్ స్నాక్

Palak paneer is a tasty restaurant dish which is famous throughout India and Pakistan. It has Palak (Spinach) and Paneer which is Indian farmer's cheese made by curdling heated milk with lemon juice, vinegar or any other food acids.
Story first published: Friday, May 24, 2013, 17:00 [IST]
Desktop Bottom Promotion