పన్నీర్ సాండ్‌విచ్ ఢోక్లా

By Sindhu
Subscribe to Boldsky

పన్నీర్ తో తయారు చేసే వంటలంటే చాలా వరకూ అందరీకి ఇష్టమే. ఇండియాలో చాలా వరకూ శాఖాహారాలు ఎక్కువగా తయారు చేస్తుంటారు . దరిదాపు దీని రుచి చికెన్ రుచిని కలిగి ఉంటుంది . ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ మరియు అధిక న్యూట్రీషియన్స్ ను కలిగి ఉంటుంది. పన్నీర్ క్యాప్సికమ్ ఇండియన్ రిసిపి దేశంలో బాగా ప్రసిద్ది చెందింది. పన్నీర్ స్టఫ్ క్యాప్సికమ్ చాలా రుచికరంగా వండుతుంటారు.

టోస్ట్ సాండ్విచ్ కొరకు వెజిటేరియన్స్ వివిధ రకాల పదార్థాలను స్టఫింగ్ గా ఉపయోగించచ్చు. ఆలూ బ్రెడ్ సాండ్విచ్ నుండి పనీర్ టోస్ట్ వరకూ చాలా రకాలు మీరు ట్రై చేయవచ్చు . మీరు పనీర్ ఫ్యాన్స్ అయితే , ఇక్కడ మీకోసం చాలా సులభంగా..త్వరగా తయరయ్యే పనీర్ సాండ్విచ్ తయారుచేసే విధానాన్ని ఇస్తున్నాము . ఈ విధానాన్ని అనుసరించి పనీర్ సాండ్విచ్ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

Paneer-Sandwich-Dhokla

కావలసిన పదార్థాలు:

శనగపిండి: 1cup

రవ్వ: 2 tsp

పెరుగు: 2 tsp

అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్: 1tsp

చక్కెర: tsp

ఫ్రూట్ సాల్ట్: 2tsp

ఉప్పు: తగినంత

పన్నీర్: 100grm

పచ్చిమిరపకాయలు: 2

కొత్తిమీర చట్నీ: తగినంత

తయారీచేయు విధానం:

1. ఒక గిన్నెలో శనగపిండి, రవ్వ, పెరుగు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, చక్కెర, ఫ్రూట్ సాల్ట్, తగినంత ఉప్పు వేసి నీళ్లుపోస్తూ చిక్కగా కలపాలి.

2. ఈ మిశ్రమాన్ని వెడల్పు కడాయిలో వేసి ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించాలి. తర్వాత దీన్ని చల్లార్చి సాండివిచ్‌లా కట్ చేయాలి. పన్నీర్‌ను కూడా సాండ్‌విచ్ షేప్‌లో కట్ చేసి..

3. పెనంపైన ఒక నిమిషం వేయించాలి. తర్వాత ఒక ఢోక్లా పెట్టి దానికి కొత్తిమీర చట్నీ కలిపి.. పన్నీర్ ముక్కలు మధ్యలో పెట్టి.. దాన్ని మరో ఢోక్లాతో మూసేయాలి.

4. అన్నింటినీ ఇలా చేసిన తర్వాత కడాయిలో వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువతో పోపుచేసి దానిని సాండ్‌విచ్‌లపై వేయాలి.

5. రెడీ అయిన ఈ పన్నీర్ సాండ్‌విచ్ ఢోక్లాను టమాటో సాస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Paneer-Sandwich-Dhokla

    Sandwich is the most popular breakfast dish in most of the households. It is easy to make, is filling and can be a great dish for dieters as well. Sandwiches can vary as per choice and taste. You can either have plain toasted bread with scrambled eggs or add some stuffing in between the bread slices. You can either use vegetables or some masala for stuffing the sandwich toast.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more