For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ పరోటా

By B N Sharma
|

Rice Parota
కావలసిన పదార్ధాలు: అన్నం-రెండు కప్పులు, గోధుమపిండి-నాలుగు కప్పులు, ఉల్లిపాయ-ఒకటి, ఉప్పు-రుచికి తగినంత, కొత్తిమీర-కొద్దిగా, పచ్చిమిర్చి-రెండు. కారం-చెంచా, నూనె-కొద్దిగా.

తయారు చేయు విధానం:
ముందుగా బాణలిలో చెంచా నూనె వేసి అన్నాన్ని వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి ఇంకొద్ది సేపు మగ్గించి దించాలి. ఇప్పుడు గోధుమపిండిలో ఉప్పు, కాసిని నీళ్ళ కలిపి చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి. అరగంటయ్యాక పిండిని ఉండలుగా చేసి మధ్యలో అన్నం మిశ్రమం ఉంచి, చపాతీలా ఒత్తుకోవాలి. పెనం పొయ్యిమీద పెట్టి వేడయ్యాక వాటిని నూనెతో కాల్చుకుంటే రైస్ పరోటా రెడీ.

English summary

Rice Parota | రైస్ పరోటా

First fry the cooked rice in a band lie, when it turns to golden color, put onion pieces, green chillies, etc. After some time mix it with soaked wheat floor.
Story first published:Saturday, August 20, 2011, 12:52 [IST]
Desktop Bottom Promotion