For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాబుదానా ఖీర్ : మహా శివరాత్రి స్పెషల్

|

శివరాత్రి అతి దగ్గరలో రాబోతోంది. శివ భక్తులు అప్పడు వారి ప్రిపరేషన్స్ ను మొదలు పెట్టేసే ఉంటారు. శివరాత్రి రోజు రాత్రి శివుడు, పార్వతిని పెళ్ళిచేసుకుంటాడని నమ్మతారు. ఆ జ్ఞాపకార్ధంగా చాలా మంది శివరాత్రిని జరుపుకుంటారు అంటారు. అందుకే శివ భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ముగించుకొన్న తర్వాత దేవుడికి ఇష్టమైన వంటలు మాత్రమే ఫలహారంగా తీసుకుంటారు. అటువంటి వాటిలో సాబుదాన ఖీర్ కూడా ఒకటి.

Sabudana Kheer: For Maha Shivratri

సాబుదాన ఖీర్ ఒక ఇండియన్ డిజర్ట్ రిసిపి. మీకు తీపి తినాలనే కోరిక ఉన్నప్పుడు ఇటువంటి సింపుల్ అల్పాహారంను తయరుచేసుకోవచ్చు. ఈ స్పెషల్ వంట పిల్లలకు మరియు పెద్దలకు కూడా చాలా ఇష్టం. మరి మీరు కూడా రుచి చూడాలంటే ఒక సారి ప్రయత్నించి పండుగ ప్రాశ్యస్తంను పూర్తి చేసుకోండి...
కావల్సిన పదార్థాలు:
సాబుదానా(సగ్గుబియ్యం): 1cup
పాలు: 2cups
బెల్లం లేదా పంచదార: 1cup
యాలకుల పొడి : 1tsp
ఎండుద్రాక్ష: 10
బాదం: 10
జీడిపప్పు: 10
మర్గైన్: 1tbsp
కుంకుమ పువ్వు: చిటికెడు

తయారుచేయు విధానం :
1. చిన్న సైజు సాబుదానా(సగ్గుబియ్యం)ను ఉపయోగించండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది తయారుచేయడానికి ఒక గంట ముందు వీటిని నీటిలో నానబెట్టుకోవాలి. ఇది మీ వంటచేసే పద్దతిని త్వరగా పూర్తి చేస్తుంది.
2. డీప్ బాటమ్ పాన్ లో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతుండగా అందులో పంచదార లేదా బెల్ల వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార కంటే బెల్లం, ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి కాచుకోవాలి.
3. లేదా ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరుగుతుండగా బెల్ల బేసి రెండు మూడు నిముషాల ఉడకించి, బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కరుగుతున్న పాలలో పోయాలి.
4. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకొన్న సాబుదానను వేసి 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
5. అంతలోపు ఒక బౌల్ స్టౌ మీద పెట్టి అతి తక్కువ మంట మీద మార్గ్రిన్ ను వేడి చేయాలి. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క పొడి మరియు డ్రై ఫ్రూట్స్ వేసి ఒక సెకను వేయించుకొన్నాక సాబుదాన ఉడుకుతున్న మిశ్రమంలో పోయాలి.
6. ఇప్పుడు అందులోని చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసి గార్నిస్ చేయాలి. అంతే స్టౌ మీద నుండి క్రిందికి దింపి, బాగా చల్లారిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్ లో పెట్టి, రెండు మూడు గంటల తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి.అంతే సాబుదాన ఖీర్ రెడీ. ఉపవాసం ఉన్నవారు తీసుకోవచ్చు.

English summary

Sabudana Kheer: For Maha Shivratri

Published: Thursday, February 20, 2014, 18:33 [IST] Ads by Google The festival of Lord Shiva is just a week away and devotees have already started their preparation. It is believed that on the night of Maha Shivratri, Lord Shiva married Parvati. To commemorate this day, the devotees of Lord Shiva fast on Shivratri. To break their fast, they choose from a number of Shivratri recipes. The recipe we are discussing today is called ‘sabudana kheer'.
Desktop Bottom Promotion