For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడి

|

భారతీయు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన స్వీట్ మీ కోసం....

Soan Papdi

కావలసిన పదార్థాలు:
శెనగపిండి/పెసరపిండి: 1.5cups
మైదా: 2cups
పాలు: 2tbsp
పంచదార: 3cups
యాలకులు: 1tsp
నీళ్ళు: 1.5cup
పాలిథిన్ షీట్:
నెయ్యి: 250grms

తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదాను జల్లించి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో మైదా, శెనగపిండి మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేయించాలి. మైదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు మరో గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో పంచదార, పాలు పోసి మీడియం మంట మీద సిరప్(పాకం)వచ్చేంత వరకూ కలుపుతూ బాగా మరిగించాలి. ఒక్కసారిగా పాకం చిక్కబడే సమయంలో స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
4. తర్వాత వేయించి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని కూడా పేపర్ మీద లేదా తడిలేని ప్లేట్ లో వేసి ఆరనివ్వాలి.
5. తర్వాత బేకింగ్ డిష్ లేదా పాన్ కు నెయ్యి బాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా చల్లబడిన తర్వాత షుగర్ సిరఫ్ లో మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలగలపాలి. మైదా షుగర్ సిరఫ్ తో బాగా కలిసిపోయి దారపు పోగుగా మరుతున్న సమయంలో పిండిపోయడం ఆపేసి మైదామిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకొన్న బేకింగ్ డిష్ లో పోయాలి.
6. తర్వాత యాలకుల పొడిని చల్లుకొని చల్లారనివ్వాలి. దాని మీద పిస్తా, బాదాం తో గార్ని చేసి పాలీథిన్ కవర్ తో పూర్తిగా కప్పి ఉంచాలి. అంతే సోన్ పప్పిడి రెడీ...

English summary

Soan Papdi: Soft Diwali Sweet | సోన్ పప్పిడి-దీపావళి స్పెషల్

Since then, Diwali has being recognized as the festival of lights where people light up their houses with lamps (traditional or new rope lights), decorate their houses and draw rangolis. They also wear new outfits, perform Lakshmi Puja and then burn crackers.
Story first published: Friday, November 9, 2012, 18:23 [IST]
Desktop Bottom Promotion