For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు..

|

నైవేద్యానికి పులగం

కావలసినవ పదార్థాలు:
బియ్యం: 2cups
పెసరపప్పు: 1/2cup
నెయ్యి: 1tbsp
జీలకర్ర: 1tsp
మిరియాలు: 1/2tsp
ఉప్పు: తగినంత
నీళ్లు: 4cups
జీడిపప్పు: 10

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం, పప్పు కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి.
2. తర్వాత గిన్నెలో నెయ్యి వేడయ్యాక, జీలకర్ర, మిరియాలు వేసి, వేయించాలి. నీళ్లు పోసి, మరుగుతుండగా, నానెబట్టిన బియ్యం పప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అన్నం అయ్యాక జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. అంతే నైవేద్యానికి పులగం రెడీ..

నైవేద్యానికి పులగం

నైవేద్యానికి పులగం

ముందుగా బియ్యం, పప్పు కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి.

చక్కెర పొంగలి

చక్కెర పొంగలి

ముందుగా బియ్యం, పెసరపప్పు విడివిడిగా వేయించాలి.

పచ్చిబఠానీ(గ్రీన్ పీస్)తాలింపు

పచ్చిబఠానీ(గ్రీన్ పీస్)తాలింపు

ముందుగా పచ్చి బఠాణీలను శుభ్రం చేసి, కడిగి, నాలుగు గంటలు నానబెట్టాలి.

శెనగల తాలింపు

శెనగల తాలింపు

శెనగలు రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, కడిగి, రెండు గంటలు నానబెట్టాలి.

పెసల తాలింపు

పెసల తాలింపు

పెసలు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన పెసలు నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యేవరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి.

చక్కెర పొంగలి

కావలసిన పదార్థాలు:
బియ్యం: 1cup
పాలు: 1cup
పెసరపప్పు: 1/2 cup
పంచదార: 2cups
పచ్చి కొబ్బరి ముక్కలు: 1cup
జీడిపప్పు: 10
నెయ్యి: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం, పెసరపప్పు విడివిడిగా వేయించాలి.
2. తర్వాత మూడు గ్లాసుల నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. విడిగా నెయ్యిలో జీడిపప్పు, కొబ్బరి వేయించాలి.
3. ఇప్పుడు పప్పు, బియ్యం ఉడికిన తర్వాత పంచదార వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు, కొబ్బరి, నెయ్యి వేసి కలిపి, దించాలి. అంతే కమ్మని చక్కెర పొంగలి రెడీ..

పచ్చిబఠానీ(గ్రీన్ పీస్)తాలింపు

కావలసిన పదార్ధాలు:
గ్రీన్ పీస్ (పచ్చిబఠానీలు.: 1/2kg
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చి బఠాణీలను శుభ్రం చేసి, కడిగి, నాలుగు గంటలు నానబెట్టాలి.
2. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లో పచ్చిబఠాణీలను వేసి, కొద్దిగా నీళ్ళుపోసి స్టౌ మీద పెట్టాలి.
3. రెండు విజిల్సు వచ్చాక స్టౌ ఆపాలి. ఆవిరి పోయాక మూతతీసి ఉడికినవో లేవో చూసి, ఉడకకపోతే స్టవ్ వెలిగించి మళ్లీ కాసేపు ఉడక నివ్వాలి.
4. పచ్చిబఠాణీలలో నీళ్ళు వుంటే వంచి పక్కన పెట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడిచేయ్యాలి.
6. కాగిన నూనేలో ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కారం, ఉప్పు వేసి ఉడికిన పచ్చిబఠాణీలను వేసి కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.

శెనగల తాలింపు

కావలసిన పదార్ధాలు:
శెనగలు: 1/2kg
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. శెనగలు రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, కడిగి, రెండు గంటలు నానబెట్టాలి.
2. ఇప్పుడు స్టౌ వెలిగించి కుక్కర్ లో శెనగలు వేసి, కొద్దిగా నీళ్ళుపోసి స్టౌ మీద పెట్టాలి.
3. రెండు విజిల్సు వచ్చాక స్టౌ ఆపాలి. ఆవిరి పోయాక మూతతీసి ఉడికినవో లేవో చూసి, ఉడకకపోతే స్టవ్ వెలిగించి మళ్లీ కాసేపు ఉడక నివ్వాలి.
4. శెనగలులో నీళ్ళు వుంటే వంచి పక్కన పెట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడిచేయ్యాలి.
6. కాగిన నూనేలో ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కారం, ఉప్పు వేసి ఉడికిన శెనగలు వేసి కలిపి స్టవ్ ఆపాలి.(కావాలంటే తినే ముందు ఉల్లి ముక్కలు, నిమ్మరసం వేసుకొని తినొచ్చు. అంతే తాలింపు శెనగలు రెడి.

పెసల తాలింపు

కావలసిన పదార్దాలు:
పెసలు: 1/2kg
ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. పెసలు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన పెసలు నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యేవరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి.
3. నూనె వేడి అయ్యాక నానబెట్టిన పెసలు వేస్తే అవి బాగా వేగి ఫైకితేలతాయి. వీటిని తీసి టిష్యూపేపరు పరిచిన ఒకప్లేటులోకి తీసుకోవాలి. పెసల్లో నూనె ఉంటె పేపర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి.
4. ఇప్పుడు వేగిన పెసల్లో వేపిన కరివేపాకు, ఉప్పు, కారం కలపాలి.

English summary

Special Naivedyam Recipes for Vinayaka Chavithi | వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు..

Naivedyam is a South Indian vegetarian food. b It is a sweet and hot delicacy prepared for festivals and occasions..some easy to make naivedyam recipes that are listed here...
Desktop Bottom Promotion