కారంకారంగా.. రుచికరంగా ..ఉండే పనీర్ రోల్స్ తయారీ విధానం

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఈ వారంతంలో స్నాక్ పార్టీ ఉందా?? ఇంటికి వచ్చే అతిధులకోసం ఏఅమి చెయ్యాలి ముఖ్యంగా శాఖాహారులకోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా?? పనీర్ తో రుచికరమైన స్నాక్ చెయ్యటమెలాగో చూద్దాము.పనీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందువల్ల ఈ స్నాక్ తప్పక ప్రయత్నిచవలసిన వంటకం.ఈరోజు మేము చెప్పబోయే వంటకం స్పైసీ పనీర్. ఇది మీ అతిధుల హృదయాలని హత్తుకోవడం ఖాయం.

ఎంత మందికి సరిపోతుంది-4

ప్రిపరేషన్ టైం-10 నిమిషాలు

తయారీ సమయం-20 నిమిషాలు

Spicy And Yummy Paneer Roll Recipe,

కావాల్సిన పదార్ధాలు:

1.సన్నగా తరిగిన పచ్చి మిర్చి-2 లేదా 3

2.తురిమిన పనీర్-1.5 కప్పు

3.ఉడికించి మాష్ చేసిన ఆలూ-1

4.వైట్ బ్రెడ్-8 స్లైసులు

5.బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పు

6.సన్నగా తరిగిన కొత్తిమీర-2 టేబుల్ స్పూన్లు

7.తురిమిన చీజ్-3 టేబుల్ స్పూన్లు

8.కారం-1 టీ స్పూను

9.నూనె-వేయించడానికి సరిపడా

10.ఛాట్ మసాలా-1/2 టీ స్పూను

11. ఉప్పు-రుచికి తగినంత

తయారీ విధానం:

1.ఒక పెద్ద గిన్నె తీసుకుని పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి పిండిలా తయారు చెయ్యాలి.

2.బ్రెడ్ స్లైసులని తీసుకుని చివర్లు కత్తిరించాలి.చపాతీ కర్ర తీసుకుని బ్రెడ్ స్లైసులని చపాతీలాగ వత్తుకోవాలి.ముందు తయారు చేసుకున్న పిండిని ఒక్కో స్లైసులో పెట్టి మరలా వత్తాలి.

3.ఇలా వత్తుకున్న ఒక్కో స్లైసుని మూడు ముక్కలుగా కోసి లోపలి స్టఫ్ఫింగ్ విడిపోకుండా ఒక టూత్ పిక్‌తో అదిమిపెట్టాలి.

4.ఈలోగా స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసి పైన ముక్కలుగా కోసుకున్న బ్రెడ్ స్లైసులని వేయించాలి.

5.బాగా వేగాకా ఒక కిచెన్ నాప్కిన్ మీదకి తీసుకుంటే ఇది నూనెని పీల్చుకుంటుంది. ఈ రోల్స్ అతిధులకి వడ్డించేముందు టూత్ పిక్ తీసి మీకిష్టమైన చట్నీ లేదా డిప్ తో కలిపి వడ్డించాలి.

ఈ రోల్స్‌నే మరింత పసందుగా మార్చాలనుకుంటే పండు మిర్చి టమాటా చట్నీ లేదా పుదీనా మరియూ కొత్తిమీర చట్నీతో కలిపి వడ్డించవచ్చు.

మరింక ఆలశ్యమెందుకు ప్రయత్నించి చూసి ఎలా ఉందో మాకు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచెయ్యండి.

English summary

Spicy And Yummy Paneer Roll Recipe

Spicy And Yummy Paneer Roll Recipe,Paneer roll is one such amazing snack that you can serve as a starter at your house party. As paneer is also very healthy, it is worth trying this dish for sure. Today, we are sharing this spicy paneer roll recipe that will win the hearts of your guests. Take a look.
Story first published: Tuesday, January 31, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter