For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్-కిడ్స్ సమ్మర్ స్పెషల్

|

Strawberry Biscuit Pudding.
వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే గడుపుతారు కాబట్టి వారికి రోజూ ఏదోఒకరకమైన స్నాక్స్ చేసిస్తుంటారు. అయితే పిల్లలు ఎప్పుడు తిన్నవే తినాలా అంటూ మారం చేస్తుంటారు. వాటిని తినకుండా దూరం పెట్టేస్తుంటారు. అలాంటి వారికోసం సింపుల్ గా ఇంట్లోనే చిటికెలో తయారు చేసే వంటకం స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్. ఎలాగూ ఇంట్లో బిస్కెట్స్ వుంటాయి కాబట్టి ఒక వెరైటీ టేస్ట్ ను పిల్లలకు రుచి చూపించండి. స్ట్రాబెర్రీ తేకున్నా వేరే ఏ ఫ్రూట్ అయినా వాడుకోవచ్చు....

కావలసిన పదార్థాలు
స్ట్రాబెర్రీ: 2-4
బిస్కెట్లు(తియ్యనివి): 100grms
వెన్న: 2tsp
పంచదార పొడి: 6tsp
కోడిగుడ్లు: 2
పాలు: 2cups
నిమ్మకాయలు: 2
క్రీమ్: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా స్ట్రాబెర్రీస్ ను కట్ చేసి కొద్దిగా నీళ్ళుపోపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే బిస్కెట్లను పొడిపొడిగా చేసుకోవాలి.
2. తర్వాత స్ట్రాబెరీ పేస్ట్, వెన్నకు ఒక స్పూను పంచదార కలిపి బాగా గిలక్కొట్టి అందులోనే బిస్కెట్ పొడి కూడా కలపాలి.
3. బేకింగ్ పాన్ లో ఈ పొడిని పోసి 10 నిమిషాలు బేక్ చేయాలి. అలాగే కోడిగుడ్లు పగలకొట్టి బాగా గిలక్కొట్టాలి.
4. ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగిన తర్వాత పంచదార, గుడ్డులోని తెల్లసొన వేసి కలియబెడుతూ రెండు నిమిషాలు ఉడికించి దించుకోవాలి.
5. వెన్న, పంచదార వేసిన క్రీమును పాలలో కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చివరకు నిమ్మరసం కలిపి బేకింగ్ టిన్ లో పోసి 2గంటలు ప్రిజ్ లో వుంచాలి. అంతే బిస్కెట్ పుడ్డింగ్ రెడీ. సమ్మర్ సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

English summary

Strawberry Biscuit Pudding...! | స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్-కిడ్స్ సమ్మర్ స్పెషల్

Strawberry Biscuit Pudding is an easy dessert, you can make it at home with any kind of biscuits you have. Simple enough to make this yummy fresh-fruit, pudding. It is always a welcome addition to our dinner table.
Story first published:Monday, May 7, 2012, 16:27 [IST]
Desktop Bottom Promotion