For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ స్పెషల్ రష్యన్‌ సలాడ్‌

|

Summer Special Russian Salad
పూర్తిగా పండ్లు...కూరగాయలు, గుడ్డు...పాలుతోటి తయారయ్యే రష్యన్ సలాడ్ లో కావల్సినన్ని పోషకపదార్ధాలు లభిస్తాయి.

కావలసిన పదార్థాలు:
పొటాటో: 2-3
పచ్చి బఠాణీలు: 1cup
బీన్స్, క్యారెట్ ముక్కలు: 1cup
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు: 2cup
ఆలివ్స్(గ్రీన్ ఫ్రూట్): 10-12
పాలు: 1cup
మైదా, వెన్న: 1tsp
మిరియాల పొడి: 1tsp
నిమ్మరసం: 1tsp
గుడ్లు: 2
ఉప్పు: 1/2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్, పొటాటో ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి.
2. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది.
3. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి.
4. తర్వాత ఉడికించి కట్ చేసిన కోడి గుడ్లను గార్నిష్ చేసి పైన మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ రెడీ..దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టి హాట్ సమ్మర్ లో కూల్ గా అందించవచ్చు.

English summary

Summer Special Russian Salad | సమ్మర్ స్పెషల్ రష్యన్‌ సలాడ్‌

This salad despite its name is a very popular tapas dish in Spain. Its taste is completely different to the tinned variety and is a doddle to prepare with a light binding of mayonaise added just before serving.
Story first published:Monday, March 12, 2012, 17:39 [IST]
Desktop Bottom Promotion