For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన ఉప్మా ఇడ్లీ

|

Tasty Upma Idly
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయ్యందే, వంట్లో చురుకుదనం ఉండదు, ఏ పని చేయాలనిపించదు. బ్రేక్ ఫాస్ట్ తోనే మిగిలిన కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అయితే ప్రతి రోజు ఏదో రకంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటా. ఇడ్లీ, దోశ, పెసరట్లు, పెరుగన్నం, ఉప్మా, పులిహోరా...ఇలా రకరకాలుగా. అయితే వీటితో రోజూ చేసుకునేదానికంటే కొంచెం భిన్నంగా తయారు చేసుకొన్నట్లైతే బోరు కొట్టకుండా కొత్తరకం వంటకం రుచి చూసినవాళ్లం అవుతాం. కాబట్టి ఇడ్లీలో సాదారణ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీ ఇలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మరొక కొత్తరకం ఇడ్లీ. ఇడ్లీతో ఉప్మా చేసి రుచి చూసింటారు. అదే ఉప్మాతో ఇడ్లీ ఎలా ఉంటుందో రుచి చూడండి మరి.....

కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ: 1cup
ఆవాలు, జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
అల్లం తురుము: 1tsp
జీడిపప్పు: 10
శెనగపప్పు: 1tbsp
మినపప్పు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బొంబాయి రవ్వను కొద్దిగా నెయ్యి వేసి వేగించుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద మరో పాన్ పెట్టి సరిపడా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, శెనగపప్పు, మినప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో రవ్వ వేసి బాగా కలిపి దగ్గర పడకుండానే దించేయాలి.
4. తర్వాత క్రిందికి దింపుకొన్న ఉడికీ ఉడకని(సగం ఉడికిని ఉప్మాని)ఇడ్లీలుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతే ఉప్మా ఇడ్లీ రెడీ..

English summary

Tasty Upma Idly | రుచికరమైన ఉప్మా ఇడ్లీ

Breakfast being the most important meal of the day, one has to make sure they don't skip it. Most Dietitian advice against rice based dishes. When you are on a diabetic diet, the usual idly and Dosa doesn't suit as it is again made with rice. So finding better options with wheat really helps. This Idli made with Bombay Rava is another diabetes dish that is very quick and Diet friendly recipe. As we think of different dishes for a morning variety, this serves as a quick option. We just soaked the batter for 10 minutes for it to get ready.
Story first published:Tuesday, May 1, 2012, 13:34 [IST]
Desktop Bottom Promotion