For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ పతాకంలా ప్రతిబింబించే త్రివర్ణ జ్యూస్

|

ఈ స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఏదైనా స్పెషల్ గా, డిఫరెంట్ గా తయారు చేయాలనుకుంటున్నారా. అయితే ఈ నోట్లో నీళ్ళూరించే ఈ స్పెషల్ రిసిపిని తయారు చేసి ఒక దేశీ టచ్ ఇవ్వండి. స్వాతంత్ర దినోత్సవం నాడు స్వీట్ మరియు స్నాక్స్ తో సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మరింత గ్రాండ్ గా జరగాలంటే దేశీ టచ్ తో ఇటువంటి రిసిపిలు ఉండాల్సిందే.

ఇలా స్పెషల్ గా వంటే రిసిపిలకు చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది. అంతే కాదు రుచిగా కూడా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలనకు ఫర్ ఫెక్ట్ డిసెర్ట్ మాత్రమే కాదు, అందరికి నచ్చే, మెచ్చే డిజర్ట్ కూడా ఇది. మరి ఈ ట్రైకలర్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

గ్రీన్ లేయర్ కు కావల్సినవి:

కివి పండు(తురుముకోవాలి): 1/2cup

నీళ్ళు: 1 మరియు 1/2cup

జెలటిన్: 2tsp

వైట్ లేయర్ కు కావల్సినవి:

వైట్ లేయర్ కు కావల్సినవి:

హెవీ క్రీమ్: 2cups

పంచదార: మీకు అవసరం అనిపిస్తేనే(అది కూడా మీ టేస్ట్ కు తగ్గట్టు)

జెలటిన్: 2tsp

ఆరెంజ్ లేయర్ కోసం:

ఆరెంజ్ లేయర్ కోసం:

హెవీ విప్పింగ్ క్రీమ్: 1cup

మిఠాయి చెక్కర: అవసరం అయితే

మామిడి గుజ్జు: 1cup

ఆరెంజ్ ఫుడ్ కలర్: చిటికెడు

తయారు చేయు విధానం:

తయారు చేయు విధానం:

గ్రీన్ లేయర్ తయారు చేసుకొనే విధానం:

1. ముందుగా 1/4కప్పు నీటిలో జెలటిన్ వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత కివి పండు తురుమును, ఒకటిన్నర కప్పు నీళ్ళలో పోసి వేడి చేసుకోవాలి.

3. కివి తురుము ఉడకడం మొదలైనకా అందులో జెలటిన్ ను వేయాలి.

స్వాతంత్రదినోత్సవ స్పెషల్ -త్రివర్ణ జ్యూస్

స్వాతంత్రదినోత్సవ స్పెషల్ -త్రివర్ణ జ్యూస్

4. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపి బాగా మిక్స్ చేసుకోవాలి.

5. డిజర్ట్ గ్లాస్ లోనికి జెల్లీ వేసి, గ్రీన్ లేయర్ ను సిద్దం చేసుకోవాలి .

6. జెల్లీ సెట్ అయ్యే వరకూ ఈ గ్లాస్ ను 6-8గంటలు రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.

వైట్ లేయర్ తయారు చేయడం :

వైట్ లేయర్ తయారు చేయడం :

1. ముందుగా జెలటిన్ ను 1/4కప్పు నీటిలో వేసి మిక్స్ చేయాలి.

2. తర్వాత ఒక గిన్నెలో పంచదార మరియు క్రీమ్ వేసి వేడి చేయాలి.

3. తర్వాత జెలటిన్ వేసి బాగా మిక్స్ చేయాలి.

4. గ్రీన్ లేయర్ మీద పన్నా కోట్ మీద పోయాలి.

5. తర్వాత ఈ మిశ్రమాన్ని పన్నాకోట్ సెట్ అయ్యే వరకూ 6-8గంటలు రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.

ఆరెంజ్ లేయర్ తయారుచేయడం కోసం:

ఆరెంజ్ లేయర్ తయారుచేయడం కోసం:

1. ఒక మిక్సింగ్ బౌల్లో తాజా క్రీమ్ మరయు పంచదార వేసి బాగా గిలకొట్టాలి. రెండు కలిసిపోయేలా చేయాలి.

2. తర్వాత మ్యాంగో ప్యూరీ మరియు ఫుడ్ కలర్ ను కూడా మిక్స్ చేయాలి.

3. ఈ మిశ్రమాన్ని వైట్ పన్నా కోట్ లేయర్ మీద పోయాలి. ఇప్పుడు దీన్ని 2-3గంటల పాటు రిఫ్రిజరేటర్ లో పెట్టుకోవాలి . అంతే ఈ త్రివర్ణ జ్యూస్ కు ఆరెంజ్ స్లైస్, వైట్ చాక్లెట్ మరియు పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి.

English summary

Tricolor parfait for the Independence day

Do something different this Independence day and try these mouth-watering recipes with a desi touch.The memories about getting sweets and snacks during these celebrations and enjoying the day with our friends and family.The dessert is perfect for the occasion and loved by all.
Story first published: Wednesday, August 14, 2013, 15:44 [IST]
Desktop Bottom Promotion