For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉగాది పచ్చడి

|

Ugadi Pachadi
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

కావలసిన పదార్ధాలు:
మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1
వేప పూత - 1/2 cup సన్నవి కొబ్బరి ముక్కలు- 1/2 cup
కొత్త చింతపండు- 100 grm
కొత్త బెల్లం- 100 grm
పచ్చిమిరపకాయలు-2
అరటిపండు - 1
ఉప్పు - కొద్దిగా
నీళ్లు

తయారు చేయు విధానము:
1. ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. అందులోని పూతని సిద్ధంగా పెట్టుకోవాలి.
2. మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే కొబ్బరిముక్కలను సన్నగా తరగాలి.
3. చింతపండులో కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక పదినిమిషాల తర్వాత చేత్తో కలిపి గుజ్జును వేరుచేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలిపాలి.
5. మిర్చిని సన్నగా తరిగి. అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ మీరు తినండి అందరికి తినిపించండి. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. 'కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి".

Story first published:Saturday, March 13, 2010, 13:26 [IST]
Desktop Bottom Promotion