For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ మసాలా ఇడ్లీ

|

Vegetable Masala Idli
కావలసినవి:
ఇడ్లీలు: 4-6
క్యారట్ తురుము: 1/2cup
బఠాణీ: 1/2cup
బీన్స్ తరుగు: 3tbps
బంగాళదుంప ముక్కలు: 1/2cup
అల్లంతురుము: 1/2tsp
ఉల్లితరుగు: 1/2cup
పచ్చిమిర్చితరుగు: 2tbsp
గరంమసాలా: 1tsp
కిస్‌మిస్: 15 (నీళ్లలో నానబెట్టి మెత్తగా చేయాలి)
పెరుగు: 1/2cup
టొమాటో ప్యూరీ: 1/2cup
జీడిపప్పు + గసగసాల పేస్ట్: 2tbsp
ఉప్పు, కారం, పసుపు, నూనె: తగినంత
కొత్తిమీర: చిన్న కట్ట
కరివేపాకు: రెండు రెమ్మలు
పుదీనాఆకులు: 10

తయారు చేయు విధానం:
1. ముందుగా కూరగాయలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక్కో ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు పెరుగును క్రీమ్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక జీడిపప్పు:గసగసాల పేస్ట్, పచ్చిమిర్చితరుగు, ఉల్లితరుగు, అల్లం తురుము వేసి కలిపాక ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. అందులోనే టొమాటో ప్యూరీ కూడా వేసి వేయించాలి.
5. అన్నీ గుజ్జులా అయ్యాక కూరముక్కలు వేసి బాగా కలిపి గరంమసాలా చల్లాలి. తరవాత పెరుగు వేసి ఐదు నిముషాల పాటు కలిపాక ఇడ్లీ ముక్కలు వేసి జాగ్రత్తగా కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఇడ్లీ మసాలా కుర్మా రెడీ.

English summary

Vegetable Masala Idli | వెజిటేబుల్ మసాలా ఇడ్లీ

A very tasty snack of left-over idlis. Masala Idli is quite easy to prepare. The idlis are tempered with mustard seeds, urad dal, curry leaves and green chilies. Most often eaten at breakfast or as a snack, idli are usually served in pairs with chutney, sambar, or other accompaniments. Mixtures of crushed dry spices such as milagai podi are the preferred condiment for idlis eaten on the go.
Story first published:Thursday, April 26, 2012, 10:49 [IST]
Desktop Bottom Promotion