Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
శ్రమ తక్కువ,రుచి ఎక్కువ..బ్యాచిలర్స్ సండే స్పెషల్ సోంబేరి చికెన్..జస్ట్ 20 నిమిషాల్లోనే..!
బ్యాచిలర్స్ కి సండే అంటేనే చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. అయితే చాలామంది బ్యాచిలర్స్ బయట రెస్టారెంట్లలో ఆర్డర్ పెట్టుకుని తింటుంటారు. గంటల తరబడి వంటగదిలో కష్టపడాలంటేనే వారికి కాస్త బద్ధకం వస్తుంటుంది. అనేక రకాల పాత్రలు వాడటం, మసాలాలు నూరడం లాంటివి వారికి పెద్ద ప్రహసనంలా అనిపిస్తాయి. అలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన, సులభమైన వంటకం సోంబేరి చికెన్.
పేరుకు తగ్గట్లుగానే దీన్ని తయారు చేయడానికి మీరు పెద్దగా శ్రమ పడాల్సిన పనే లేదు. వంటరాని వారు, వంటగదిలో ఎక్కువ సేపు గడపడానికి ఇష్టపడని బ్యాచిలర్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. దీన్ని తయారు చేయడానికి సుమారు 20 నుండి 25 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. రుచిలో మాత్రం ఇది అద్భుతంగా ఉంటుంది. సోంబేరి చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చికెన్ - అర కిలో
ఉల్లిపాయలు - 2 లేదా 3
అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - ఒక టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
గరం మసాలా - ఒక టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కస్తూరి మేథి - అర టీస్పూన్
యాలకుల పొడి - చిటికెడు
వంట నూనె - 3 టీస్పూన్లు
ఉప్పు - మీ రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా అరకిలో చికెన్ ను తీసుకుని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. నీరంతా పోయేలా చూసుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న చికెన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, యాలకుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కస్తూరి మేథీ, తగినంత ఉప్పు, కారం, మూడు టీస్పూన్ల నూనె వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టాలి. మంటను మీడియంలో ఉంచుకుని ఉడికించడం ప్రారంభించాలి. చికెన్ అడుగున మాడిపోకుండా మధ్యమధ్యలో గరిటతో తిప్పుతూ ఉండాలి. చికెన్ నుండి వచ్చే నీటితోనే ముక్కలు ఉడికిపోతాయి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు.
-మూత పెట్టి సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. ముక్క మెత్తగా ఉడికి, నూనె పైకి తేలుతుంది. అంతే ఎంతో గుమగుమలాడే రుచికరమైన సోంబేరి చికెన్ రెడీ.
-వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీ, బగారా రైస్ లోకి గానీ ఈ చికెన్ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












