For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ కెసర్ పిస్తా మిల్క్ షేక్ రిసిపి-సమ్మర్ స్పెషల్

|

మండే ఎండల్లో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం. ఒకసారి తింటే చాలు మళీమళ్లీ తిపాలనిపించే రుచి దాని సొంతం. సమ్మర్ లో ఐస్ క్రీమ్స్, స్మూతీస్, కుల్ఫీ మరియు మిల్క్ షేక్ లను టేస్ట్ చేయడానికి ఇదే మంచి సమయం.

మిల్క్ షేలను వివి ధ వెరైటీ ఫ్లేవర్స్ తో బాదాం, కేసర్, చిక్కో, మ్యాంగో, లిచి మరియు పిస్తా ఫ్లేవర్ లతో తయారు చేసుకుంటారు . ఈ మిల్క్ షేక్ కు కొద్దిగా కేసర్(కుంకుమపువ్వు)జోడించి కలిపి తయారు చేసుకోవచ్చు. కెసర్ పిస్తా మిల్క్ షేక్ మన ఇండియన్ స్టైల్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒక సారి టేస్ట్ చేయండి . ఈసమ్మర్ సీజల్ ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ కు ఒక అద్భుతమైన ట్రీట్ కేసర్ పిస్తా మిల్క్ షేక్..

Healthy Kesar Pista Milkshake Recipe

కావల్సిన పదార్థాలు:

  • పిస్తాచో(పిస్తాపప్పు)-1cup
  • కేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా
  • బాదం:1/2cup
  • పంచదార: 11/2cup
  • యాలకలు: 4-5
  • పాలు: 1ltr

తయారుచేయు విధానం:
1. ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్ లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి.
2. 6 గంటల తర్వాత , గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి.
3. పాలను బాగా మరిగించి , మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి.
4. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి . మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5.ఇప్పుడు ఈ పేస్ట్ ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి.
6. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి.
7. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.

English summary

Healthy Kesar Pista Milkshake Recipe

In this hot summer month, we always feel like drinking something cool, so that our body is hydrated enough to beat the heat. So, to reduce your thirst level and to keep yourself hydrated well and healthy, today we have a special recipe for you.
Story first published:Monday, April 25, 2016, 17:23 [IST]
Desktop Bottom Promotion