ఫుడ్ లవర్స్ కోసం నోరూరించే పన్నీర్ టిక్కా రిసిపి

Posted By:
Subscribe to Boldsky

ఎంత కష్టమైనా పడండి..ఎన్ని రకాలుగా అయినా వండి పెట్టండి అప్పుడప్పుడు ముఖం చిట్లింపులు తప్పవు! భర్త చెయ్యి కడుక్కుంటాడు..పిల్లలు ప్లేడు నెట్టేస్తారు ''మళ్లీ ఇదేనా?'' అనే ప్రశ్న ఎదురవుతుంది.

జవాబు రెడీ- పనీర్ ... పనీర్ ఐటమ్స్ చూడడానికీ తినడానికీ ఫన్నీగా ఉంటాయి. వెరైటీగా ఉంటాయి. కాబట్టి, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ పనీర్ టిక్కా రిసిపి పరిచయం చేస్తున్నాము .

కారంకారంగా.. రుచికరంగా ..ఉండే పనీర్ రోల్స్ తయారీ విధానం

ఈ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. లోపల సాప్ట్ గా మరియు భయట క్రిస్పీగా ఉండే ఈ పనీర్ టిక్కా రిసిపిని ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పనీర్ టిక్కా రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం..

Easy Paneer Tikka Recipe For Food Lovers

కావల్సిన పదార్థాలు :

 • పనీర్ (కాటేజ్ చీజ్) : 1 కప్పు (మీకు నచ్చిన షేప్ లో కాస్త మందంగా కట్ చేసుకోవాలి)
 • గ్రీన్ క్యాప్సికమ్ : 2(2inch లో కట్ చేసుకోవాలి)
 • రెడ్ క్యాప్సికమ్ 1(1 inch లో కట్ చేసుకోవాలి)
 • మీడియం ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లు
 • ఇంగువల: 1కప్పు
 • కారం : 1/2టీస్పూన్
 • గరం మసాలా: 1/4టీస్పూన్
 • కస్తూరి మేతి: 1/2టీస్పూన్
 • ధనియాల పొడి : 1టీస్పూన్
 • ఛాట్ మసాలా: 1+1టీస్పూన్
 • నూనె: 2 టేబుల్ స్పూన్లు
 • ఉప్పు: రుచికి సరిపడా
 • నిమ్మరసం : 2 టేబుల్ స్పూన్లు
 • ఉల్లిపాయ మరొకటి మీడియం సైజ్: గార్నిష్ కోసం సన్నని స్లైస్ గా కట్ చేసుకోవాలి.

మేతి పన్నీర్ రైస్ రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ ..

చిక్కటి పెరుగు(పనీర్) తయారుచేసే విధానం:

 • రెండు కప్పుల(ప్లెయిన్ పెరుగు)తీసుకుని ఒక పల్చటి క్లాత్ లో వేసి గట్టిగా చుట్టి 30 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగులోని నీరు లేకుండా వడిగిపోతుంది. ఈ
 • పెరుగును మరో గంట అలాగే ఉంచాలి. ఈ గట్టిపడ్డ పెరుగును ఉపయోగించాలి.

తయారుచేయు విధానం :

1. చిక్కగా పెరుగును ఒక బౌల్లో తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, మేతి పౌడర్, ధనియాల పొడి, ఒక టీస్పూన్ ఛాట్ మసాల మొత్తం మిక్స్ చేస్తే మ్యారినేషన్ తయారైనట్లే...

2. తర్వాత ఈ మిశ్రమంలో రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కుల, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. గట్టి పెరుగు ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా చేయాలి. ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచాలి. సాధ్యమైతే ఈ మిశ్రమాన్ని రాత్రి తయారుచేసి, ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

3. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పనీర్, ఆనియన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక చిన్న టూత్ పిక్ షీకర్ కు గుచ్చి పెట్టాలి.ఇలా అన్నింటిని తయారుచేసుకుని, ఒక పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత నాన్ స్టిక్ గ్రిడిల్ లేదా తవా తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక అందులో పన్నీర్ గుచ్చి పెట్టిన టూత్ స్టిక్స్ ను నిధానంగా ఉంచి, సున్నితంగా షాలో ఫ్రై చేసుకోవాలి.

హాట్ అండ్ యమ్నీ పన్నీర్ చీజ్ బాల్స్

5. టూత్ పిక్ ను రెండు వైపులా తిప్పుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిముషాలు ఫ్రై చేసుకున్న తర్వాత క్రిస్పిగా డ్రైగా మారిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి.

6. సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకొన్న తర్వాత టూత్ స్టిక్స్ ను తీసేసి, వాటి మీద ఒక టీస్పూన్ ఛాట్ మసాలా మరియు కొద్దిగా నిమ్మరసం చిలకరించి ఆనియన్ స్లైస్ ను గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయాలి. అంతే పన్నీర్ టిక్కా రెడీ. దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Easy Paneer Tikka Recipe For Food Lovers

Paneer tikka masala prepared with paneer chunks marinated with curd and desi spices and then roasted on tawa on very low flame. We can prepare it for any special occasion.
Story first published: Friday, July 7, 2017, 12:00 [IST]
Subscribe Newsletter