For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘాటైన పొంగల్ రెసిపి ; కారా పొంగల్ ను ఇంటివద్దనే ఎలా తయారుచేసుకోవచ్చు

కారంగా ఉండే పొంగల్ లేక కారా పొంగల్, సాంప్రదాయకమైన దక్షిణ భారత వంటకం.ముఖ్యంగా నైవేద్యానికి వాడే ఈ పదార్థాన్ని వెన్ పొంగల్ అని కూడా అంటారు. కారా పొంగల్,అల్పాహారంలో తినే ఒక ప్రముఖమైన పదార్థం.ఈ వంటకానికి

Posted By: DEEPTHI T A S
|

కారంగా ఉండే పొంగల్ లేక కారా పొంగల్, సాంప్రదాయకమైన దక్షిణ భారత వంటకం.ముఖ్యంగా నైవేద్యానికి వాడే ఈ పదార్థాన్ని వెన్ పొంగల్ అని కూడా అంటారు.

కారా పొంగల్,అల్పాహారంలో తినే ఒక ప్రముఖమైన పదార్థం.ఈ వంటకానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి కానీ, అన్నిటిలో నేతి పొంగల్ ఎక్కువగా చేస్తారు.నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది కాబట్టి ఇది అందరూ ఇష్టపడే పదార్థం.పొంగల్ తింటే తేలికగా మరియు హాయిగా ఉంటుంది.

కారా పొంగల్ ఉడకబెట్టిన అన్నంలో పప్పుని మరియు రుచికోసం దినుసులని కలిపి తయారు చేస్తారు.నెయ్యి యొక్క రుచి మిగతా దినుసుల రుచిని సమానం చేసి పొంగల్ ని ఆనందింపచేసేలా చేస్తుంది.

అందుకని, మీకు మా తరహా కారా పొంగల్ని ప్రయత్నించాలని అనిపిస్తే, వీడియో మరియు చిత్రాలను చూసి ఈ వంటకం తయారు చేసే విధానం నేర్చుకోండి.

కారా పొంగల్ తయారు చేయు విధానం|కారమైన పొంగల్ ఎలా తయారు చేయాలి |కారా పొంగల్ తయారీ |వెన్ పొంగల్ తయారీ| పొంగల్ తయారీ
కారా పొంగల్ తయారు చేయు విధానం|కారమైన పొంగల్ ఎలా తయారు చేయాలి |కారా పొంగల్ తయారీ |వెన్ పొంగల్ తయారీ| పొంగల్ తయారీ
Prep Time
10 Mins
Cook Time
25M
Total Time
35 Mins

Recipe By: కావ్యశ్రీ.ఎస్

Recipe Type: ప్రధాన వంటకం

Serves: 2-3

Ingredients
  • పెసర పప్పు- 3/4 కప్పు

    అన్నం- 3/4 కప్పు

    జీలకర్ర-1 చెంచా

    అల్లం-1 ఇంచ్

    కరివేపాకు- 8-9

    పచ్చి మిర్చి - 5-6(కోసినవి)

    కొత్తిమీర- 1/2 కప్పు(తరిగినవి)

    దంచిన మిరియాలు- 3/4 చెంచా

    జీడిపప్పులు- 8-10(సగానికి చీల్చినవి)

    పసుపు- 3/4 చెంచా

    ఉప్పు-3/4 చెంచా

    నెయ్యి-3/4 చెంచా

    నీళ్ళు - 6 కప్పులు +1 కప్పు

How to Prepare
  • 1 అన్నంని కుక్కరు లో వేయాలి.

    2 దానికి పెసర పప్పు కలిపి, తక్కువ సెగలో వేయించాలి.

    3 దానికి ఆరు కప్పుల నీళ్ళు కలపాలి.

    4 ఒకసారి మొత్తం కలిపి, మూత పెట్టలి.

    5 4-5 విజిల్స్ దాకా కుక్కర్లో ఉండనివ్వాలి.

    6 కొంచెం నెయ్యి ఒక మూకుడు లో వేసుకోవాలి.

    7 అది మొత్తం కరిగే దాకా కరగనివ్వాలి.

    8 దానిలో జీలకర్ర మరియు కరివేపాకు వేయాలి.

    9 దానికి తురిమిన అల్లం మరియు కోసిన పచ్చి మిరపకాయలు కలపాలి.

    10 అన్నీ వేశాక బాగా కలపాలి.

    11 మిరియాల పొడి మరియు జీడిపప్పులు వేయాలి.

    12 తరువాత, దానికి పసుపు వేసి కలపాలి.

    13 దానిలో వండిన అన్నం మరియు పప్పు యొక్క మిశ్రమ్మాన్ని వేసి కలపాలి.

    14 ఒక కప్పు నీళ్ళు పోసి , అన్ని పదార్థాలు బాగా కలిసే దాక కలపాలి.

    15 దానిని ఒక 5 నిమిషాలు వండనివ్వాలి.

    16 అందులో కోసిన కొత్తిమీర వేసి కలపాలి.

    17 చివరిగా తగినంత ఉప్పు వేసి కలపాలి.

    18 మూకుడు లో నుంచి తీసి ఒక గిన్నె లో వేసుకోవాలి.

    19 ఆ తరువాత వేడిగా వడ్డించుకోవాలి.

Instructions
  • అన్నం కడిగి ఉండేలా చూసుకోవాలి మిరియాలు మొత్తం ఒకేసారి కలపచ్చు లేక ముక్కలుగా వేసుకోవచ్చు నెయ్యి కలపడం వల్ల, వంటకం ప్రత్యేకంగా తయారవుతుంది నీళ్ళు కలపడం వల్ల పొంగల్ మృదువుగా తయారవుతుంది ఈ పదార్థాన్ని కొబ్బరి పచ్చడితో కలిపి కూడా తినచ్చు.
Nutritional Information
  • వడ్డించబడే పరిమాణం - ఒక గిన్నె
  • కేలరీలు - 263.6 కెలు
  • కొవ్వు - 15.9 గ్రా
  • ప్రొటీన్- - 5.9 గ్రా
  • కార్బోహైడ్రేట్లు - 24.3 గ్రా
  • చెక్కర- - 1.8 గ్రా
  • ఫైబర్ - 0.4 గ్రా
[ 4 of 5 - 68 Users]
English summary

Spicy Pongal Recipe | How To Prepare Spicy Pongal | Khara Pongal Recipe | Ven Pongal Recipe | Pongal recipe

Spicy pongal is a traditional South Indian dish. It is mainly offered as naivedyam food along with sweet pongal. It is prepared by adding the cooked rice and dal to a whole load of seasoned spices. The taste of ghee that is balanced by the spices lets you enjoy every bite of the pongal. Watch the video and learn how
Desktop Bottom Promotion