For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసి శంకర్పాలి రెసిపీ : ఇంటిలో నమక్ పారా ఎలా తయారుచేయాలి

స్పైసి శంకర్పాలి మహారాష్ట్రకి చెందిన ప్రసిద్ధ భారతీయ వంటకం. పండుగ సమయంలోను మరియు సాయంత్రం స్నాక్ గా తయారుచేస్తారు. ఇక్కడ వీడియో మరియు ఫొటోలతో వివరణాత్మక ప్రక్రియ ఉంది.

Posted By: Lakshmi Perumalla
|
కారా శంకర్పాలి రెసిపీ వంటలు | Namkeen Shankarpali Recipe | Kara Shankar Poli Recipe | Boldsky

స్పైసి శంకర్పాలి అనేది మహారాష్ట్ర నుండి వచ్చి ప్రసిద్ధి చెందిన భారతీయ వంటకం. దీనిని నమక్ పారా అని కూడా పిలుస్తారు. ఈ స్నాక్ ని సాయంత్రం టీ సమాయంలో మరియు పండుగల సమయంలో తయారుచేస్తారు.

స్పైసి పిండిని డైమండ్ ఆకారంలో ముక్కలు కోసి నూనెలో డీప్ ఫ్రై చేసి నమ్కీన్ శంకర్పాలిని తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో.వేడి వేడి టీతో స్పైసి శంకర్పాలి తింటే చాలా బాగుంటుంది.

స్పైసి శంకర్పాలిని తయారుచేయటం చాలా సులభం. కానీ కొంత సమయం పడుతుంది. ఈ స్నాక్ సిద్ధం చేయటానికి సమయం పడుతుంది. కానీ వేగించటానికి మాత్రమే సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇంటిలో తయారుచేయాలని అనుకుంటే ఈ వీడియో మరియు స్టెప్ బై స్టెప్ ఫొటోలతో ఉన్న తయారి విధానంను చూడండి.

కరా శంకర్పాలి రెసిపీ వీడియో

స్పైసి శంకర్పాలి రెసిపీ | ఇంటిలో నమక్ పారా ఎలా తయారుచేయాలి | నమ్కీన్ శంకర్పాలి రెసిపీ | కారా శంకర్ పోలి
స్పైసి శంకర్పాలి రెసిపీ | ఇంటిలో నమక్ పారా ఎలా తయారుచేయాలి | నమ్కీన్ శంకర్పాలి రెసిపీ | కారా శంకర్ పోలి
Prep Time
10 Mins
Cook Time
40M
Total Time
50 Mins

Recipe By: కావ్య శ్రీ. ఎస్

Recipe Type: స్నాక్స్

Serves: 1 బౌల్

Ingredients
  • మైదా - ½ కప్పు

    ఎర్ర కారం పొడి - 1 టేబుల్ స్పూన్

    ఉప్పు - రుచికి సరిపడా

    నూనె - 6 టేబుల్ స్పూన్లు + వేయించడానికి

    నీరు - 8 టేబుల్ స్పూన్లు

How to Prepare
  • 1. ఒక పెద్ద గిన్నెలో మైదా తీసుకోవాలి.

    2. ఎర్ర కారం మరియు ఉప్పును కలపాలి.

    3. ఒక చిన్న పాన్ లో 6 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి.

    4. మైదా పిండిలో ఈ నూనెను కలపాలి.

    5. కొంచెం నీటిని కలుపుతూ మృదువైన మెత్తని పిండిలా కలపాలి.

    6. 5 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి.

    7. పిండిని సమాన భాగాలుగా విభజించి ఒకొక్క భాగాన్ని బంతి ఆకారంలో చేయాలి.

    8. రోలింగ్ పిన్ ఉపయోగించి రోటి మాదిరిగా చేయాలి.

    9. నిలువుగా పొడవు స్ట్రిప్స్ కట్ చేసి, డైమండ్ ఆకారంలో చిన్న చిన్న

    ముక్కలుగా కట్ చేయాలి.

    10. వీటిని వేగించటానికి పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.

    11. మృదువైన డైమండ్ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి నూనెలో వేయాలి.

    12. మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేగించాలి.

    13. 5 నిముషాలు చల్లారాక సర్వ్ చేయాలి.

Instructions
  • పిండిని బాగా మర్దన చేస్తే పిండి మృదువుగా మరియు మెత్తగా ఉంటుంది
  • మీడియం మంట మీద డీప్ ఫ్రై చేయాలి. లేకపోతే మాడిపోతాయి
  • వీటిని గాలి చొరబడని బాక్స్ లో నిల్వ చేస్తే కొన్ని వారాల పాటు నిల్వ ఉంటాయి.
Nutritional Information
  • సర్వింగ్ సైజు - 1 కప్పు
  • కేలరీలు - 562 కేలరీలు
  • కొవ్వు - 21 గ్రాములు
  • ప్రోటీన్ - 9.1 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు - 81.3 గ్రాములు
  • ఫైబర్ - 2.4 గ్రాములు

కరా శంకర్పాలి రెసిపీ స్టెప్ బై స్టెప్

1. పెద్ద బౌల్ లో అరకప్పు మైదా తీసుకోవాలి.

2.1. ఒక స్పూన్ ఎర్ర కారం వేయాలి.

2.2. రుచికి సరిపడా ఉప్పు వేయాలి.

3.1. ఒక చిన్న పాన్ లో 6 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి.

4.1. మైదా పిండిలో వేడి నూనె కలపాలి.

4.2. బాగా కలపాలి.

5. కొంచెం నీటిని కలుపుతూ మృదువైన మెత్తని పిండిలా కలపాలి.

5.1. 6 టేబుల్ స్పూన్ల నీటిని కలపాలి.

5.2. మృదువైన మెత్తని పిండిలా కలపాలి.

6.1. 5 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి.

7.1. పిండిని సమాన భాగాలుగా విభజించాలి.

7.2. ఒకొక్క భాగాన్ని బంతి ఆకారంలో చేయాలి.

8.1. రోలింగ్ పిన్ ఉపయోగించి రోటి మాదిరిగా చేయాలి.

9.1. నిలువుగా పొడవు స్ట్రిప్స్ కట్ చేయాలి.

9.2. ఆ తర్వాత క్రాస్ గా డైమండ్ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

10.1. పాన్ లో నూనె పోసి వేడి చేయాలి. (వేగించటానికి)

11.1. మృదువైన డైమండ్ ముక్కలను ఒక దాని తర్వాత ఒకటి నూనెలో వేయాలి.

12.1. మీడియం మంట మీద గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేగించాలి.

13.1. 5 నిముషాలు చల్లారాక సర్వ్ చేయాలి.

[ 5 of 5 - 88 Users]
Read more about: snacks సాక్స్
English summary

Spicy Shankarpali Recipe | How To Make Namak Para At Home | Namkeen Shankarpali Recipe | Kara Shankar Poli

Spicy shankarpali recipe - images, video & step-by-step procedure. Namak para is a famous Maharashtrian snack that is prepared for almost all festivals and celebrations. It is easy to make them at home.
Story first published: Wednesday, November 29, 2017, 11:41 [IST]
Desktop Bottom Promotion