Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఇడ్లీ, దోశ, అన్నం.. ఎందులోకైనా అదిరిపోయే మటన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మటన్ తెచ్చినప్పుడు ఎప్పుడూ ఒకేలా గ్రేవీ, రోస్ట్ లేదా చుక్కా చేసుకుని తింటుంటాం. కానీ ఎప్పుడైనా కాస్త కొత్తగా, ఇంట్లోనే మసాలా నూరి మటన్ మసాలా తయారు చేశారా? బయట దొరికే ప్యాకెట్ మసాలాలు కాకుండా, అప్పటికప్పుడు తాజా దినుసులతో మసాలా రుబ్బి చేస్తే.. ఆ కూర రుచే వేరంతే.
ఈ మటన్ మసాలా వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ, బగారా రైస్.. ఇలా ఎందులోకైనా అద్భుతంగా సెట్ అవుతుంది. స్పైసీ అండ్ టేస్టీ మటన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మటన్ - ముప్పావు కిలో (750 గ్రాములు)
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
నూనె - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
అనాస పువ్వు - 1
లవంగాలు - 4
దాల్చిన చెక్క - చిన్న ముక్క
సాంబార్ ఉల్లిపాయలు - 20
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 10
చిన్న టమాటాలు - 2
మిరియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10
కూరకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 1
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉల్లిపాయ ముక్కలు - 100 గ్రాములు
కరివేపాకు - 1 రెమ్మ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా మటన్ ను శుభ్రంగా కడగాలి. కుక్కర్ లో మటన్, కొద్దిగా పసుపు, ఉప్పు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, సోంపు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. మిరియాలు, జీడిపప్పు, టమాటాలు వేసి ఇవి మెత్తబడే వరకు మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి నూనె పైకి తేలేలా చక్కగా వేయించాలి.
-మసాలాలు బాగా వేగిన తర్వాత కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న మటన్ ను (నీళ్లతో సహా) ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న తాజా మసాలా పేస్ట్ ను కూడా వేయాలి. మూతపెట్టి సన్నని మంటపై మరో 8-10 నిమిషాల పాటు కూరను ఉడకనివ్వాలి.
-గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మటన్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













