Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సమ్మర్ స్పెషల్ రెసిపి..ఈజీగా ఇలా చేసుకుంటే మండే ఎండల్లో చల్లగా ఉంటారు
చలికాలం దాదాపుగా అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది. సమ్మర్ లో మండే ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లగా ఉండే డ్రింక్స్ ని తీసుకోడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో చాలామంది మన శరీరానికి హాని కలిగించే రసాయన పదార్థాలు ఉండే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోగలిగే ఫ్రూట్ కస్టర్డ్ లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్.
ఫ్రూట్ కస్టర్డ్ వల్ల ఎండాకాలంలో కడుపు చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్ కస్టర్డ్ రెసిపి ఎలా చేసుకోవాలి, దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇక్కడ చూడండి.
ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కస్టర్డ్ పౌడర్
-పాలు
-నల్ల ద్రాక్ష
-ఎర్ర ద్రాక్ష
-పచ్చ ద్రాక్ష
-యాపిల్
-దానిమ్మ
-అరటి పండు
-పండిన మామిడికాయ
-పంచదార
ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ల వెన్నీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి ఇందులో 20ఎమ్ఎల్ పాలు పోసి గడ్డలు లేకుండా కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో 500ఎమ్ఎల్ పాలు పోసి మరిగించుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు పంచదార పోసి కలపండి.
-పాలు మరిగిన తర్వాత ఇందులోనే బౌల్ లో కలిపి ఉంచిన కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి బాగా కలపి 4-5 నిమిషాల పాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఈ మొత్తాన్ని బాగా చల్లారిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన ఎర్ర ద్రాక్ష, కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల పచ్చ ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, 1 అరటి పండు ముక్కలు,2 టేబుల్ స్పూన్ల నల్ల ద్రాక్ష ముక్కలు, 1/4 కప్పు యాపిల్ ముక్కలు, 1 కప్పు కట్ చేసిన పండిన మామిడి లోపలి ముక్కలు వేసి మొత్తం బాగా కలిపి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
-కావాలనుకుంటే ఇందులో చెర్రీలు,జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
-అంతే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












