For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదుషా : ఫెస్టివల్ స్పెషల్ స్వీట్

|

స్వీట్స్ తినడానికి చాలా మంది ఇష్టపడుతారు, కానీ మనలో ఎంత మందికి స్వీట్స్ తయారుచేయడం తెలుసు, మన ఇంట్లో వారికి కూడా ఎంత మరింది ఎన్ని వెరైటీ స్వీట్స్ తెలిసుంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో మీకోసం ఒక యమ్మీ స్వీట్ డిష్ ను పరిచయం చేస్తున్నాము.

స్వీట్స్ ను మనం ఏ ఫంక్షన్ కైనా మరియు ఫెస్టివల్స్ కైనా బయట స్వీట్ షాప్ నుండి తీసుకొచ్చి సర్వ్ చేయడం లేదా తినడం చేస్తుంటారు. అయితే చాలా సింపుల్ రిసిపిలను మనం ఇంట్లోను ఎందుకు ప్రయత్నించకూడదు.

READ MORE: తంబిట్టు : వర మహాలక్ష్మీ వ్రత స్పెషల్ డిష్

బాదుషా చాలా సింపుల్ అండ్ ఈజీ రిసిపి. చాలా తక్కవు పదార్థాలతోనే మీ నోరూరిస్తుంటాయి. అయితే వీటిని ఎలా తయారుచేయాలి. ఏమేమి అవసరం అవుతాయో చూద్దాం....

Badusha

కావల్సిన పదార్థాలు:
మైదా: 3cups
బట్టర్ : 1/2cup
బేకింగ్ పౌడర్: 1tsp
బేకింగ్ సోడ: 1చిటికెడు
పాలు: 1cup
పంచదార: 2కప్పులు
డ్రై కోకనట్ (తురుముకోవాలి): గార్ణిష్ కోసం కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా

READ MORE: ఓనమ్ స్పెషల్: అడ పాయసం: కేరళ స్వీట్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3కప్పుల మైద మరియు 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. 10 నిముషాల తర్వాత పిండిలో కొద్దిగా తీసుకొని బాల్ షేప్ చేసుకోవాలి. లేదా ట్రైయాంగిల్ షేప్ లో చుట్టుకోవచ్చు.
4. ఇలా అన్ని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాచాలి.
5. ఇప్పుడు కాగుతున్న నూనెలో రౌండ్ గా చుట్టి పెట్టుకొన్ని మైదా పిండిని (పచ్చిబాదుషాను) వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. అంతలోపు మరో పాన్ స్టౌ మీ పెట్టి 3-4కప్పుల నీళ్ళు పోసి రెండు కప్పుల పంచదార వేసి బాయిల్ చేయాలి.బాగా మరిగిస్తుంటే, షుగర్ సిరఫ్ చిక్కగా రెడీ అవుతుంది .
7. ఇప్పుడు నూనెలో వేగించుకొన్న బాదుషాలను షుగర్ సిరఫ్ లో వేయాలి. తర్వాత వాటి మీద డ్రై కోకనట్ పౌడర్ గార్నిష్ చేయాలి . అంతే ఈ ఫెస్టివల్ సీజన్ లో వేడిగా లేదా చల్లగా బాదుషాను సర్వ్ చేయవచ్చు.

English summary

Badusha The Best Sweet For Festivals: Telugu Vantalu

Most of us love to eat this sweet, but how many of us know how to prepare it, in our own homes? Well, the yummiest sweet that we are going to prepare is the badusha.
Story first published: Wednesday, August 26, 2015, 16:00 [IST]
Desktop Bottom Promotion