For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన ఆలూ ఖీర్ రిసిపి: స్వీట్ డిష్

|

మీకు ఒక రుచికరమైన స్వీట్ రిసిపిని తినాలని కోరికగా ఉందా! ఆలూ ఖీర్ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది . దీన్ని పొటాటో పుడ్డింగ్ లేదా స్వీట్ పొటాటో అనికూడా పిలుస్తారు. ఆలూ ఖీర్ రిసిపి ఒక స్వీట్ డిష్ . ఇది అద్భుతమైన టేస్ట్ ను అందివ్వడం మాత్రమే కాదు. ఇందులో అనేక న్యూట్రీషియన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

READ MORE: కొంచెం కారం... కొంచెం తీపి.. ఆలూ దమ్...

ఇది రంజాన్ సమయంలో తయారుచేసుకొనే ఒక అద్భుతమైన రుచి కలిగిన స్వీట్ డిష్ . ఈ స్వీట్ రిసిపిని ఇఫ్తార్ సమయంలో మీల్స్ తో పాటు కలిపి తీసుకోవచ్చు . ఈ డిష్ ను తయారుచేయడం చాలా సులభం మరియు దీన్ని తయారుచేయడం చాలా తక్కువ సమయం పడుతుంది . మరి ఈ స్వీట్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Delicious Aloo Kheer Recipe: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2
నెయ్యి: 4 4 tsp
ఎండుద్రాక్ష- 25 gms
డ్రై ఫ్రూట్స్ - 25 gms
పాలు - 3 cups
పంచదార - 3/4 cup
యాలకలపొడి - ½ tsp
కుంకుమపువ్వు - కొద్దిగా

READ MORE: ఆలూ సమోసా: మాన్ సూన్ స్నాక్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల యొక్క తొక్క తొలగించి, వాటిని తురుముకోవాలి.
2. తర్వాత బంగాళదుంప తురుమును నీళ్ళలో వేసి స్టార్చ్ ను తొలగించాలి.
3. కొద్దిసేపు బంగాళదుంప తురుమును నీటిలో నాననివ్వాలి.
4. పాన్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత అందులో ద్రాక్ష మరిు జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.
6. ఇప్పుడు నీటిలో నుండి బంగాళదుంప తురుమును తీసి నీరు మొత్తం పిండిసేయాలి.
7. ఇప్పుడు ఈ తురుమును పాన్ లో వేసి రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
8. పాన్ కు అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి. దీన్ని 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే పాలు పోసి ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో పంచదార, యాలకలు, ద్రాక్ష, మరియు డ్రై ఫ్రూట్స్ ను పాన్లో వేసి మిక్స్ చేయాలి.
10. ఆ తర్వాత కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పొటాటో ఖీర్ రెడీ ...

English summary

Delicious Aloo Kheer Recipe: Telugu Vantalu

Delicious Aloo Kheer Recipe: Telugu Vantalu, This noon lets try something delicious! We here to present Aloo kheer recipe to you. This is also known as potato pudding or sweet potato. Aloo kheer recipe is a sweet dish which is rich in taste and has many nutrients.
Story first published: Friday, July 10, 2015, 16:22 [IST]
Desktop Bottom Promotion