For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష చతుర్ధి స్పెషల్ : బేసన్ లడ్డు

|

మరో వారం రోజుల్లో గణేష చతుర్థి రాబోతున్నది. దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. గణేషుడికి మోదక్ అన్నా మరియు లడ్డూలన్నా చాలా ఇష్టం. అందువల్లే గణేష చతుర్థి రోజున తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ లడ్డులను తయారుచేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు.

లడ్డులను వివిధ రకాల పదార్థాలతో వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. బూందీ, సాట్టు, బేసన్, మలై మొదలైన రకాల లడ్డులు నోరూరిస్తుంటాయి. అందులో బేసన్ లడ్డు చాలా టేస్టీగా ఘుమఘుమలాడుతూ మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి ఈ స్పెషల్ బేసన్ లడ్డు రెడీ..

 Besan Laddoo

కావల్సిన పదార్థాలు:
శెనగపిండి: 1cup
పంచదార పొడి: 1/2cup
నెయి: 1/4cup+3tbsp(కరిగించాలి)
జీడిపప్పు: గుప్పెడు
యాలకుల పొడి: 1/2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా శెనగపిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పాన్ లో వేసి అందులో జీడిపప్పు పలుకులు వేసి కొన్ని సెకండ్లు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత 1/4నెయ్యి నాన్ స్టిక్ పాన్ లో వేసి కరిగిన తర్వాత అందులో జల్లించి పెట్టుకొన్న శెనగపిండి వేయాలి.
4. 5-10నిముషాలు గోల్డ్ బ్రౌన్ కలర్ లోనికి మారే వరకూ నిధానంగా వేగించాలి .
5. శెనగపిండి బ్రౌన్ కలర్ లోకి మారగానే స్టౌ ఆఫ్ చేసి పంచదార పొడిని అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని పూర్తిగా కలగలిసే విధంగా మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులో జీడిపప్పును వేసి మరికొంత నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి, తర్వాత మరో బౌల్లోనికి మార్చుకోవాలి.
8. తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని బాగా కలగలుపుకొంటూ చిన్న చిన్నఉండలు చుట్టుకోవాలి. ఇలా లడ్డులను పిండి వేడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలి. అంతే బేసన్ సర్వ్ చేయడానికి బేసన్ లడ్డు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఒక నెలవరకూ సురక్షితంగా ఉంటాయి.

Story first published: Friday, August 22, 2014, 18:07 [IST]
Desktop Bottom Promotion