For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాబూదాన- క్యారట్ పాయసం: హెల్తీ అండ్ టేస్టీ డిజర్ట్

|

సగ్గు బియ్యం అనగానే పాయసం. పాయసం అనగానే సగ్గుబియ్యం గుర్తుకొస్తాయి కదూ! అయితే ఈ తినే తెల్లని ముత్యాలంటే చాలా ఇష్టం.

వీటినే ఆంగ్లంలో 'సాగో' అని హిందీలో 'సాబుదానా' అని అంటారు. మన భారతదేశంలో పండుగలకు చేసే పొంగలిలో, పాయసంలో వీటిని తప్పకుండా వాడటం తప్పనిసరి. వీటిని ఉపయోగించి పాయసమే కాకుండా రకరకాల పిండివంటలు తయారుచేస్తారు. అందరూ ప్రధానంగా పిల్లలు ఎంతో ఇష్టంగా సగ్గుబియ్యంతో తయారుచేసిన వంటలు తింటారు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!

సాబుదాన ఖీర్ ఒక ఇండియన్ డిజర్ట్ రిసిపి. మీకు తీపి తినాలనే కోరిక ఉన్నప్పుడు ఇటువంటి సింపుల్ అల్పాహారంను తయరుచేసుకోవచ్చు. ఈ స్పెషల్ వంట పిల్లలకు మరియు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఐతే కొంచెం వెరైటీగా క్యారెట్ మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ జోడించి పాయసం తయారుచేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా రుచి చూడాలంటే ఒక సారి ప్రయత్నించి రాబోయే సంక్రాంతి పండుగ ప్రాశ్యస్తంను పూర్తి చేసుకోండి...

sabudana-carrot-payasam-healthy-tasty-dessert

కావలసినపదార్థాలు:
సగ్గుబియ్యం (సాబూదాన్) - 1/2cup
పాలు - 1/2ltr
పంచదార - 250grms
క్యారట్ తురుము - 1cup
బాదంపప్పులు - 1/2cup (దోరగా వేయించి పొడి చేయాలి),
ఏలకుల పొడి - 1tsp
కుంకుమపువ్వు - 1/4tsp
నెయ్యి - 2tbsp
జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిషింగ్ కు సరిపడా

టమోటో- క్యారెట్ చట్నీ

తయారు చేయు విధానం:
1. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి.
2. తర్వాత పాలను మరిగించాలి.
3. అదే సమయంలో సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి.
4. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి.
5. అదే పాన్ లో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి.

క్యారెట్ సూప్ రిసిపి: వింటర్ స్పెషల్

6. ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి.
7. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి 10 నిముషాలు ఉంచాలి.
8. చివరగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి. అంతే క్యారెట్ సాబుదాన పాయసం రెడీ.

English summary

Sabudana-Carrot Payasam: Healthy and Tasty Dessert

Sabudana-Carrot Payasam: Healthy and Tasty Dessert,Carrots are the only vegetables that taste best as desserts. The carotenoid rich vegetables can be tasty kheer if the ingredients below are noted down and tried. Take a look at how to go about with the Delicious carrot kheer recipe.
Story first published: Saturday, January 2, 2016, 15:26 [IST]
Desktop Bottom Promotion