For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కరి పొంగలి: సంక్రాంతి స్పెషల్ రిసిపి

|

సౌత్ ఇండియన్ ఫెస్టివల్లో ముఖ్యంగా మరియు ప్రధానంగా ఘనంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. ఈ పండుగను తమిళనాడులో కూడా చాలా గ్రాండ్ గా పొంగల్ అని పిలుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆంద్రాలో మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకొనే ఈ పండుగకు స్వీట్ గా తయారుచేసుకొనే చెక్కర పొంగలు ఈ పండుగ యొక్క ప్రత్యేకత.

ఈ పండుగకు చాలా వెరైటీ ఫుడ్స్ ను తయారుచేస్తారు. అయితే అన్నింటిలోకి స్పెసల్ డిష్ గా స్వీట్ పొంగల్ తయారుచేసుకుంటారు. దీన్ని స్వీట్ లేదా హాట్ గా కూడా చేసుకుంటారు. మరి ఈ రుచికరమైన పొంగల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Sakkarai Pongal: Pongal Special Recipe

కావల్సిన పదార్థాలు:
నూక బియ్యం : ½ cup (సోనా మసూర బియ్యం)
పెసరపప్పు: 3tbsp
బెల్లం: ¾ cup (తురుముకోవాలి)
నీళ్ళు: 4 cups
నెయ్యి: 3tbsp
ద్రాక్ష: 12-15
జీడిపప్పు: 8-10
యాలకలు: 2 (crushed)
లవంగాలు: 2 (crushed)
తినే కర్పూరం: చిటికెడు (అవసరం అయితేనే)

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రం గా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఒక చెంచా తేనె వేసి, పెసరపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అందులో మూడు కప్పుల నీళ్ళు మరియు శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యం వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఈ మిశ్రమాన్ని ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ మెత్తగా ఉడికించుకోవాలి .
5. అంతలోపు, ఒక బౌల్లో ఒక కప్పు నీళ్ళు పోసి అందులో బెల్లం తురుము వేయాలి.
6. ఈ గిన్నె స్టౌ మీద పెట్టి, బెల్లం కరిగే వరకూ ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
7. తర్వాత అందులోనే యాలకలు, లవంగాలు, మరియు తినెకర్పూరం చిటికెడు వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
8. తర్వాత మిగిలిన నెయ్యిని పాన్ లో వేసి వేడిచేయాలి. తర్వాత అందులోనే ద్రాక్ష, జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి .
9. ఇలా ఫ్రై చేసిన వాటిని పొంగల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే వేడి వేడిగా స్వీట్ పొంగలిని సర్వ్ చేయాలి.

English summary

Sakkarai Pongal: Pongal Special Recipe

సౌత్ ఇండియన్ ఫెస్టివల్లో ముఖ్యంగా మరియు ప్రధానంగా ఘనంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. ఈ పండుగను తమిళనాడులో కూడా చాలా గ్రాండ్ గా పొంగల్ అని పిలుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆంద్రాలో మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకొనే ఈ పండుగకు స్వీట్ గా తయారుచేసుకొనే చెక్కర పొంగలు ఈ పండుగ యొక్క ప్రత్యేకత.
Desktop Bottom Promotion