Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు..ఏం రుచిరా బాబు..ఎలా చేసుకోవాలంటే
తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా తయారుచేసే అనపకాయ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని గుడ్ల కుడుములు అని కూడా పిలుస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఆవిరిపై ఉడికించడం వల్ల ఇవి తేలికగా జీర్ణమవుతాయి. ఇవి సాధారణంగా పండుగలలో లేదా ప్రత్యేక సందర్భాలలో తయారుచేసుకునే వంటకం. వీటిని నిమిషాల్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. వీటిని అల్పాహారంగా, సాయంత్రం పూట చిరుతిండిగా లేదా తేలికపాటి భోజనంగా కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లోనే అనపకాయ కుడుములను ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
అనపకాయ కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం పిండి
-అనపకాయ గింజలు
-కొత్తిమీర తరుగు
-ఉల్లికాడల తరుగు
-పచ్చిమిర్చి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీలకర్ర
-ఉప్పు
-నీళ్లు
-ఆయిల్

అనపకాయ కుడుములు తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి, 1 కప్పు ఉడికించిన అనపకాయ గింజలు,అరకప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు ఉల్లి కాడలు, 6 పచ్చి మిరపకాయలను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన మిశ్రమం, 1 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరస్పూన్ జీలకర్ర,రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత ఆ మిశ్రమంలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిముద్దలా కలుపుకోవాలి.
-తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని పిండిముద్దలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకుంటూ కుడుముల మాదిరి వత్తుకోవాలి.
సమ్మర్ స్పెషల్ లడ్డు.. శరీర వేడిని తగ్గించి ఒంటికి చలువ..ఎలా చేసుకోవాలంటే..
-తర్వాత ఒక చిల్లులున్న గిన్నెకి ఆయిల్ అప్లై చేసి రెడీ చేసుకున్న కుడుములను ఇందులో పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ బౌల్ పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లను మరిగించాలి. కుడుములు ఉంచిన జాలి గిన్నెను దీనిమీద పెట్టి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి గిన్నె మీద మూత పెట్టేయాలి. 15-20 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికిస్తే సరిపోతుంది.
-తర్వాత మూత తీస్తే అనపకాయ కుడుములు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
