Latest Updates
-
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.! -
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు! -
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తందూరి మసాలా పొడిని ఇలా తయారు చేశారంటే.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు.! -
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి! -
Headline for Deeplink -
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.! -
సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.! -
పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే గోబీ మసాలా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్!
బరువు తగ్గాలా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే క్వినోవా కిచిడీని ఇలా ట్రై చేయండి!
ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న జీవనశైలి, సమయం లేక జంక్ ఫుడ్ కు అలవాటు పడటం.. వెరసి నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయం, మధుమేహం వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నాయి. అయితే సరైన పోషకాహారం తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా సులభంగా పెంచుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం కోసం మీరు చూస్తున్నట్లయితే క్వినోవా వెజిటేబుల్ కిచిడీకి మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. సులభంగా జీర్ణమయ్యే ఈ కిచిడీ, పోషకాల గని అని చెప్పవచ్చు.

క్వినోవా వెజిటేబుల్ కిచిడి తయారీకి కావాల్సినవి
బాగా కడిగిన క్వినోవా - 1/2 కప్పు
పెసరపప్పు (పొట్టు లేనిది) - పావు కప్పు
కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాప్సికం) - 1 కప్పు
టమాటా - 1
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
స్వచ్ఛమైన నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర-అర టీస్పూన్
ఇంగువ-చిటికెడు
పసుపు-అర టీస్పూన్
ధనియాల పొడి-అర టీస్పూన్
ఉప్పు
నీళ్లు - 3 నుంచి 3.5 కప్పులు
కొత్తిమీర - అలంకరణ కోసం
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
క్వినోవా వెజిటేబుల్ కిచిడి తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో క్వినోవా, పెసరపప్పు తీసుకుని నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, చిటికెడు ఇంగువ వేయాలి. జీలకర్ర చిటపటలాడే సమయంలో అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి.
-ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కలు, మీకు ఇష్టమైన కూరగాయల ముక్కలు అన్నీ వేసి మంటను మీడియంలో పెట్టి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి.
-ఇప్పుడు కుక్కర్ లో పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. అనంతరం ముందుగా నానబెట్టుకున్న క్వినోవా, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో 3 నుండి 3.5 కప్పుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్లోని గాలి (ప్రెషర్) దానంతట అదే పోయే వరకు ఆగి మూత తీయాలి.
-చివరగా పైన సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం
చల్లుకుంటే.. నోరూరించే, ఎంతో ఆరోగ్యకరమైన వేడివేడి క్వినోవా
వెజిటబుల్ కిచిడీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications