Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తెలుగు వారికి ప్రీతికరమైన తీపి వంటకం..నోరూరించే పాకం గారెలు..ఎలా చేసుకోవాలంటే
తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలని మన పెద్దలు ఊరికే అనలేదు. గారెలు తినాలంటే అదృష్టమే ఉండాలి. అందులోనూ పాకం గారెలు తినాలి అంటే నోరు ఏ జన్మలోనో అదృష్టం చేసుకొని ఉండాలి. పాకం గారెలను బెల్లం గారెలు అని కూడా పిలుస్తారు. ఇది తెలుగువారి సంప్రదాయ వంటకం. పండుగలు, శుభకార్యాలలో తప్పనిసరిగా చేసుకునే ఒక సంప్రదాయ తీపి వంటకం ఇది. పండుగల సమయంలో వీటిని దేవుడికి నైవేధ్యంగా కూడా పెడతారు. మెత్తగా, పైన క్రిస్పీగా ఉండే గారెలను తీపి పాకంలో నానబెట్టి తయారుచేసే ఈ వంటకం నోరూరిస్తూ, అద్భుతమైన రుచిని అందిస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పాకం గారెలు,జ్యూసీగా,సాఫ్ట్ గా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపగుళ్లు
-బెల్లం
-యాలకల పొడి
-ఆయిల్
పాకం గారెలు తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు మినపగుళ్లు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత అందులో నీళ్లు పోసి కనీసం 4 గంటలు నానబెట్టండి.
-తర్వాత అందులోని నీటిని తీసేసి నానిన పప్పుని జల్లెడలో పెట్టి నీరు మొత్తం అందులో నుంచి పోయేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల బెల్లం తురుము, ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి బెల్లంను కరగనివ్వాలి. తర్వాత జాలితో బెల్లం నీటిని ఫిల్టర్ చేసుకొని మీడియం మంట మీద 2-3 పొంగులు వచ్చేదాకా బాయిల్ చేస్తే సరిపోతుంది.
-తర్వాత అందులో పావు టీస్పూన్ యలకల పొడి వేసి కలిపి చేతికి పాకం జిగురులా అనిపిస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేయండి. గిన్నెమీద మూత పెట్టి వేడి చల్లారనివ్వకుండా ఉండాలి.
-తర్వాత మిక్సీ జారులో నానబెట్టిన మినపప్పు వేసి చిటికెడు ఉప్పు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి ఓ ప్లేట్ లోకి దాన్ని తీసుకోండి.
-గ్రైండ్ చేసిన పిండిలో చిటికెడు వంటసోడా వేసి స్పూన్ తో 2 నిమిషాలు బాగా కలుపుకోండి.
-తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం వాటర్ అప్లై చేసి పిండిని కొంచెం తీసుకొని దానిమీద పెట్టి వడల్లా వత్తుకొని మధ్యలో రంధ్రంలా ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసి వాటిలో వత్తుకున్న వడలు వేసి మీడియం మంట మీద వడలు రెండువైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసి వేడిగా ఉన్న బెల్లం పాకలో వేసి పావు గంట సేపు మూతపెట్టి వదిలేయండి. తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి. ఇలాగే అన్నీ వడలను చేయండి.
-వడలను ఓ బౌల్ లో వేసి మిగిలిన పాకం అందులో పోసి అరగంటసేపు నాననివ్వాలి. అంతే పాకం గారెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










