For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయలు వాడకుండా ఆలూకర్రీ: నవరాత్రి స్పెషల్

|

నవరాత్రి తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.

నవరాత్రులు ఒక్కో రోజు.. ఒక్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ నవరాత్రి సందర్భంగా ఇల్లలో స్పెషల్ గా కొన్ని వంటలు తయారుచేసుకుంటారు. అయితే వెజిటేరియన్ వంటలకు ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా వంటలు తయారుచేసుకుంటారు. అటువంటి వంటల్లో ఆలూ కర్రీ ఒకటి. ఉపవాసం ఉండే వారికి ఇది ఒక హెల్తీ వెజిటేరియన్ ఫుడ్. మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ ఆలూ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Aloo Curry Without Onions: Holi Spl

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4-5(ఉడికించి, పొట్టుతీసి, 4బాగాలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(సన్నగా కట్ చేసి పేస్ట్ చేయాలి)
పచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర మరియు ఆవాలు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు : 1cup
కొత్తిమీర తరుగు: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి మరియు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర మరియు ఆవాలు వేయాలి.
3. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా తయారుచేసి ఉంచుకొన్న మసాలా పేస్ట్ ను వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత టమోటో మరియు పచ్చిమిర్చి వేసి, మెత్తబడే వరకూ వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులో నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
5. ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకొన్నబంగాళదుంపలు వేసి వేసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.

English summary

Aloo Curry Without Onions: Holi Spl


 Many people do not prepare onions and garlic recipes on Hindu festivals like Navratri. So, check out the aloo curry without onions and garlic. Serve this aloo curry as a side dish with fried kachoris and pickle of your choice.
Story first published: Friday, September 26, 2014, 18:14 [IST]
Desktop Bottom Promotion