For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్

|

సాధారణంగా బంగాళదుంతో వివిధ రకాల వంటలు వండుతారు. బంగాళదుపం కర్రీ, వేపుడు, చిప్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు ఇష్టమైన బంగాళదుంపలతో టేస్టీగా వంటలను తయారుచేయవచ్చు. భారతీయ వంటకాలలో బంగాళదుంప ప్రముఖమైనది. తరచూ వాడబడుతుంది. ఇంట్లో రెండు బంగాళదుంపలు ఉన్నాయంటే చాలు కూరకోసం వెతుక్కోనక్కరలేదు అంటారు. దానిని ముక్కలు చేసి, ఉఢకబెట్టి ఏదో ఒక పొడికూర, వేపుడు చేసుకోవచ్చు.

బంగాళాదుంపలను తినడం వలన విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా పోటాషియం, కాపర్, ఐరన్‌లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న బంగాళాదుంపను తీసుకోవడం వలన గుండెకు మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. అటువంటి బంగాళాదుంపతో వేపుడు చేసుకుంటే రుచికి, రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. ఈ బంగాళా దుంపతో పాటు కాలీఫ్లవర్ ను కూడా మిక్స్ చేసి తయారు చేసే మసాలా రిసిపి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Aloo Gobi Masala Recipe

కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్: 1(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
బంగాళ దుంపలు: 3 (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి,)
గ్రీన్ బటానీలు: 1cup
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
బే ఆకు: 1
హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 2tsp
పొడి మామిడి పొడి: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర: 2tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు: ½cup

తయారుచేయు విధానం:
1. ముందుగా కాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోరు వెచ్చని నీటిలో వేసి కొద్ది సమయం పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపలను కూడా కట్ చేసి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేయాలి తర్వాత అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు మరియు ఇంగువ వేయాలి. ఒక నిముషం పాటు వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 5నిముషాల పాటు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
5. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత, అందులో టమాటో ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర, డ్రై మ్యాంగో పౌడర్, కొత్తిమీర, ఉప్పు కూడా వేసి 5-6నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో పచ్చిబఠానీ, కాలీఫ్లవర్, మరియు మసాలాతో పాటు బంగాళదుంప ముక్కలు కూడా వేసి, 5-10నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత వెజిటేబుల్స్ కు మసాలా బాగా పట్టే విధంగా వేగించుకోవాలి.
8. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి 10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
9. ఒక సారి ఉడికిన తర్వాత, మూత తీసి, గరం మసాలా మిక్స్ వేసి, బాగా మిక్స్ చేయాలి.
10. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

English summary

Aloo Gobi Masala Recipe

What are you planning to include in your Diwali menu this year? Sweets are of course an integral part of the festival. But apart from that even your main course menu needs proper planning, especially if you have guests coming over. Our idea is to keep the menu simple and full of delicious items.
Story first published: Monday, November 4, 2013, 12:41 [IST]
Desktop Bottom Promotion