For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమ్లా (ఉసిరి)రైస్ రిసిపి-కార్తీక మాసం స్పెషల్

|

ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో...ఎందుకంటే ఉసిరికాయతో రకరకాల వంటలు, ఊరగాయలు తయారుచేస్తారు. అంతే కాదండోయో ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఉసిరికాయను ఇంగ్లీష్ లో gooseberry అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది.

కార్తీకంలో ఉసిరిని తప్పకుండా తినాలంటారు. ఉసిరి ఇంటికి సిరిసంపదలు తీసుకొస్తుందంటారు. ఉసిరిని అరచేతిలో ఉంచుకుంటే చాలు ఆరోగ్యం వరిస్తుందంటారు. సరిలేని గొప్పదనం ఉసిరిది! కార్తీకం స్పెషల్‌గా ఉసిరి వంటలు ఆరగించండి, ఆనందించండి...

Amla(Usirikaaya) Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బియ్యం : 1/2kg
ఉసిరికాయలు : 10
పసుపు : 1/2tsp
ఇంగువ: చిటికెడు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : తగినంత
నువ్వులపొడి : 2tsp
జీడిపప్పు : 4tsp
ఎండుమిర్చి : 4(మద్యకు కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి : 4(మద్యకు కట్ చేసుకోవాలి)
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : కట్ట
శనగపప్పు : 1tsp
మినప్పప్పు : 1tsp
ఆవాలు : 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. లేదా పెద్ద ఉసిరికాయలైతే, తురుముకోవచ్చు.
2. తర్వత పాన్ లో నూనె వేసి, కాగిన తరువాత అందులో పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేగించాలి.
3. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.
4. రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద వేగించుకొని, తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. ఆమ్లా రైస్ రెడీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్ , లంచ్ గా తీసుకోవచ్చు.

English summary

Amla(Usirikaaya) Rice Recipe

Gooseberry also called amla is a wonder fruit because it has all the goodness required to maintain good health. It has the richest source of vitamin C. A single gooseberry contains 20 times more vitamin C than that of an orange. It helps to prevent cold and cough if included in our diet regularly.
Story first published: Saturday, November 16, 2013, 12:07 [IST]
Desktop Bottom Promotion