For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్-డ్రై ఫ్రూట్ సలాడ్-శివరాత్రి స్పెషల్

|

శివరాత్రి అతి దగ్గరలో రాబోతోంది. శివ భక్తులు అప్పడు వారి ప్రిపరేషన్స్ ను మొదలు పెట్టేసే ఉంటారు. శివరాత్రి రోజు రాత్రి శివుడు, పార్వతిని పెళ్ళిచేసుకుంటాడని నమ్మతారు. ఆ జ్ఞాపకార్ధంగా చాలా మంది శివరాత్రిని జరుపుకుంటారు అంటారు. అందుకే శివ భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ముగించుకొన్న తర్వాత దేవుడికి ఇష్టమైన వంటలు మాత్రమే ఫలహారంగా తీసుకుంటారు. అటువంటి వాటిలో ఫ్రూట్ సలాడ్ ఒకటి.

ఉపవాసం ఉండే వారికి ఈ ఫ్రూట్స్ మరియు డ్రై ఫ్రూట్ సలాడ్ తగినంత శక్తిని అంధిస్తుంది. ఉపవాసం ఉండటానికి అవసరం అయ్యే పోషకాలను శరీరంలో కోల్పోకుండా ఫుల్ ఫిల్ చేస్తుంది. పండ్లు మాత్రమే కాకుండా అందులో కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Apple -Dry Fruite Salad-Shivaratri Special

కావలసిన పదార్థాలు:
యాపిల్ ముక్కలు - 2cups
పుచ్చకాయ ముక్కలు - 4
అరటిపండు ముక్కలు - 5
పిస్తా పప్పులు - 6
బాదం: 6
ఎండు ద్రాక్ష: 10
పాలు - 1cup
పంచదార - 1/2cup
తేనె - 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కొన్ని యాపిల్ ముక్కల్ని కావల్సిన సైజ్ లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో సగం మిక్సీ జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి.
3. పాలు కాచుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. వేడి చల్లారాక పాలను పండ్ల ముక్కల్లో పోయాలి. యాపిల్ ముక్కల గుజ్జుని. డ్రైఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
5. అంతే ఆపిల్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ. పది నిమిషాల తర్వాత తింటే కడుపులో చల్లగా బాగుంటుంది. శివరాత్రి ఉపవాసం ఉండే వారికి ఇది చాలా శక్తినిచ్చేటువంటి సలాడ్.

English summary

Apple -Dry Fruite Salad-Shivaratri Special

Maha Shivratri is a occasion when all of India celebrates the marriage of Lord Shiva and Devi Parvati. On this day, millions of devotees keep a fast. Even when they break their fast, they have to eat only a certain kind of vegetarian food. People on vrat during Shivaratri have to look after what they are eating! As they eat once in a day, the food needs to be healthy and nutritious. Fruit salads are healthy oil free Shivaratri recipes which can be consumed anytime in the day.
Story first published: Saturday, February 22, 2014, 12:15 [IST]
Desktop Bottom Promotion