For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ వెజిటేబుల్ ఉప్మా

|

సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ వంటకాల్లో ఉప్మా చాలా ఫేమస్. ఎందుకంటే చాలా సింపుల్ గా, చాలా సులభంగా, అతి తక్కువ సమయంలో తయారు చేసేస్తారు కాబట్టి. టైమ్ లేనప్పుడు చటుక్కున గుర్తుంచేస్తుంది. చిటికెలో చేసేస్తారు ఉప్మాను. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. మరియు మధ్యాహ్నాన లంచ్ బాక్స్ లలోనికి సర్దేసుకొంటారు. ఉప్మాను తయారు చేయడంలో చాలా పద్దతులు ఉన్నాయి. దీన్ని గోధుమ రవ్వతో తయారు చేస్తారు. అయితే కొంచెం ఢిఫరెంట్ గా బ్రెడ్, వెజిటేబుల్ తో తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా కంటే అతి తొందరగా తయారు చేసేయెచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...

Bread Vegetable Upma

కావలసిన పదార్థాలు:
రవ్వ: 1cup
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యారెట్: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిబఠాణీ: 2tbsp
టమోటో: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బ్రెడ్ స్లైస్: 8-10(చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
ఆవాలు: 1tsp
శెనగపప్పు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
గరం మసాలా: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
నీళ్ళు : 2cups
కొత్తిమీర: 2tsp(చిన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ వేడి చేసి అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో రవ్వ వేసి అతి తక్కువ మంట మీద వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి.
2. ఇప్పుడు పాన్ లో సరిపడినంత నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులో కరివేపాకు, శెనగపప్పు వేసి సన్నని మంటమీద ఒక నిముషం వేయించుకోవాలి.
3. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిముషం వేయించి, వెంటనే క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలను కూడా వేసి, వెజిటేబుల్స్ మెత్తబడేంతవరకు తక్కువ మంట మీదు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిబఠాణీలు, వేసి వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, గరం మసాలా, మరియు కారం వేసి మరో రెండు నిముసాలు వేయించి, టమోటో ముక్కలను కూడా వేసి టమోటో మెత్తబడేంత వరకూ వేయించాలి.
5. వెజిటేబుల్స్ అన్ని మెత్తబడ్డాక అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
6. నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి, తర్వాత ముందుగా వేయించి పెట్టుకొన్ని రవ్వ మరియు బ్రెడ్ ముక్కలను వేసి బాగా కలగలపాలి. అందు వల్ల రవ్వ, బ్రెడ్ రెండు నీటిలో కలిసిపోయి వెజిటేబుల్స్ తో పాటు ఉడుకుతుంది. ఉప్మా పొడిపొడిగా ఉండాలనుకుంటే అరగ్లాసు వాటర్ తక్కువగా వేస్తే సరిపోతుంది. అంతే బ్రెడ్ వెజిటేబుల్ ఉప్మా రెడీ.

English summary

Bread Vegetable Upma: Filling Breakfast Recipe | బ్రెడ్ ఉప్మా-బ్రేక్ ఫాస్ట్ స్పెషల్

Upma is a very famous breakfast recipe that is prepared in many Indian households. You can either have it for your breakfast or carry it for lunch. There are many ways to prepare upma. It is ideally made with suji (granulated Indian wheat).
Desktop Bottom Promotion