For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ చిక్కుడు కాయ ఫ్రై : స్పెషల్ సైడ్ డిష్

|

ఆలూ లేదా పొటాటో మన ఇండియాలో ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆలూతో తయారుచేసే సైడ్ డిష్ లేదా ఇతర ఏ వంటలకు కూడా ఆలూ లేకుండా వంటలు పూర్తి కావు. సాధారణంగా భారతీయ కుటుంబాలలో అల్పాహారాల్లో ప్రధానమైన ఆహారం రోటీ మరియు సబ్జీగా ఉన్నాయి.

అయితే ఈ రోటీలకు కానీ, లేదా రైస్ కు కానీ, ఆలూను సైడ్ డిష్ గా అనేక వంటలను తయారుచేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సీజన్ లో అన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు, బంగాళదుంపలు, చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి. కాబట్టి, బంగాళదుంప, చిక్కుడు కాయ కాంబినేషన్ మంచి ఆరోగ్యకరమైన వంట. మరియు రుచికరమైనది. ఇది డ్రై రిసిపి ఎక్కువ సమయం తీసుకోదు. మరి ఈ రెండింటి కాంబినేషన్ తో మీకు నచ్చే ఒక వంట.....

Broad Beans Potato Fry / Chikkudukaya Aloo Sabzi
కావల్సిన పదార్థాలు:
ఆలు: 5-6 (పొట్టు తీసి, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి)
చిక్కుడు కాయలు: 1/2kg(మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(తరిగినవి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
మెంతిపొడి: చిటికెడు
కారం: 1tsp
ధనియాల పొడి: ½tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే కట్ చేసిన పెట్టుకొన్నబంగాళదుంప ముక్కలు వేసి, మీడయం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో కట్ చేసిన చిక్కుడు కాయ వేసి, మిక్స్ చేస్తూ మరో 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఉప్పు మరియు పసుపు, మెంతిపొడి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.
4. తర్వాత మంట పూర్తిగా తగ్గించి 6-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పాన్ కు మూత పెట్టి, ఉడికించుకోవాలి. మద్య మద్యలో కలియబెడుతుండాలి.
5. ఆలూ ఉడికే లోపు, చిక్కుడు కాయ కూడా మెత్తబడుతాయి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి కూడా వేసి, అన్నింటిని మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే డ్రై అండ్ క్రిస్పీ ఆలూ అండ్ బోర్డ్ బీన్స్ ఫ్రై రెడీ. దీన్ని రోటీలకు సైడ్ డిష్ గా మరియు రైస్ -దాల్ కు సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.

English summary

Broad Beans Potato Fry / Chikkudukaya Aloo Sabzi

This is a simple broad beans recipe with potatoes. It is a simple and easy side dish that goes well with rice or chapatis.Try this potato-broad beans curry the next time you want to make something different with broad beans (chikkudukaya, avaraikkai, fava beans). This is an unusual combination but works well in this curry.
Story first published: Friday, December 12, 2014, 13:36 [IST]
Desktop Bottom Promotion