For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టర్ పనీర్: డెలిషియస్ రిసిపి

|

ఈ రోజు మీకు ఒక రుచికరమై, మరియు క్రీమీ పనీర్ రిసిపిని పరిచయం చేస్తున్నాం. బట్టర్ పనీర్ మసాలా నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఈ సాఫ్ట్ పనీర్ క్యూబ్స్ ను చాలా రుచికగా మరియు బట్టర్ టమోటో గ్రేవీ మరియు ఇతర ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు.

ఈ బట్టర్ పనీర్ మసాలా దినుసులతో బాగా మెత్తగా ఉడికించడం వల్ల నోట్లో పెట్టుకోగానే క్రీమిగా కరిగిపోతుంది చాలా అద్భుతమైన రుచని, మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా ఈ రిసిపి వెజిటేరియన్ మసాలా రిసిపిగా అందరినీ నోరూరిస్తుంటుంది. మరి దీన్నీ ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం..

Butter Paneer: A Delicious Dish

కావల్సిన పదార్థాలు:
పనీర్(కాటేజ్ చీజ్): 500grm
బట్టర్: 100grms
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయలు : 2(పేస్ట్)
టమోటో గుజ్జు: 3/4cup
కారం: 1tbsp
గరం మసాలా: 2tbsp
పంచదార: 1tsp
క్రీమ్: 1cup
కొత్తిమీర తరుగు: 1cup
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. పనీర్ తీసుకొని మీకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
2. ఇప్పడు పాన్ స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో కట్ చేసుకొన్న పనీర్ ముక్కలు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఫ్రై అయినా తర్వాత పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఉల్లి, అల్లం వెల్లుల్లిపేస్ట్ వాసన పోయే వరకూ ఉండి, తర్వాత టమోటో గుజ్జు వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే కారం, గరం మసాలా, పంచదార మరియు కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు మంట తగ్గించి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. మొత్తం ఉడికిన తరవ్ాత అందులో క్రీమ్ వేసి బట్టర్ పనీర్ ను రెండు మూడు నిముషాలు బాగా మిక్స్ చేయాలి. అంతే బటర్ పనీర్ మసాలా సర్వ్ చేయడానికి రెడీ...చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Butter Paneer: A Delicious Dish

Butter paneer is an awesome Indian paneer recipe. Butter paneer is paneer in a blend of Indian spices and tomatoes. It is just like any other paneer gravy with the only exception that it is made a bit richer by adding butter.
Story first published: Friday, January 30, 2015, 17:33 [IST]
Desktop Bottom Promotion