For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో బయట వేడి..కడుపులో చల్లగా కర్డ్ రైస్

|

Cool Summer Curd Rice
కావల్సిన పదార్థాలు:
పాలు: 2ltr
బియ్యం: 1/2kg
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయలు: 1-3
అల్లం: చిన్నముక్క
క్యారెట్: 1
సీడ్ లెస్ గ్రేప్స్:1cup
దానిమ్మగింజలు: 1cup
ఆవాలు: 2tsp
జీలకర్ర: 2tsp
శెనగపప్పు: 3tsp
మినపప్పు: 2tsp
జీడిపప్పు: 8-10
ఎండు మిర్చి: 2-4
కరివేపాకు: మూడు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట

తయారు చేయు విధాన:
1. మొదటగా అన్నం మెత్తగా వండి పక్కన తీసి పెట్టుకోవాలి. పాలు కూడా కాచి తోడు వేసి పెరుగు పులుపు రాకుండా రెడీ చేసుకోవాలి.
2. ఇప్పుడు వండుకున్న అన్నాన్ని బాగా చల్లారబెట్టాలి. ఇప్పుడు ఈ అన్నంలో అప్పుడే తోడుకున్న పెరుగుని వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఈ పెరుగు అన్నంలో తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తురిమిన కేరెట్, ద్రాక్ష, దానిమ్మ గింజలు వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి అందులో ముందుగా నూనె వేసి కాగిన తర్వాత అందులో సెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసి అవి దోరగా వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి చివరిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
5. అవి బాగా వేగిన తరువాత దించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేయించి పెట్టుకున్న తాలింపును నూనె రాకుండా జాగ్రతగా వేయాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా పెరుగు అన్నాన్ని బాగా కలపాలి.
5. ఇప్పుడు దాని తరిగిన కొత్తిమీర తో పైన గార్నిష్ చేస్తే కర్డ్ రైస్ రెడీ..దీన్ని కొంత సేపు ఫ్ర్రిజ్జ్ లో పెడితే చల్ల చల్లగా చాలా బావుంటుంది.

English summary

Cool Summer Curd Rice | కూల్ సమ్మర్: కర్డ్ రైస్


 Curd Rice is a comfort food for sure! It is a quick fix dish which can be made using left over cooked rice. And also a light meal, especially good for the sick. ‘Curd Rice’ is best served chilled, garnished with grated carrots, seedless green grapes or pomegranate arils.
Story first published:Monday, March 26, 2012, 13:02 [IST]
Desktop Bottom Promotion