For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీ-డేట్స్ పాన్ కేక్:హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

డిజెర్ట్స్ లో డేట్స్(కర్జూరాలు)చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో పుష్కలంగా ఐరన్ మరియు జింక్ కలిగి ఉంటుంది. మరియు లోక్యాలరీలను కలిగి ఉంది. అందుకే దీన్ని బ్రేక్ ఫాస్ట్ రిసిపిగా తీసుకుంటుంటారు.
రోజంతా కావల్సినంత శక్తిని పొందడానికి ఇటువంటి హెల్తీ ఆహారం చాలా అవసరం.

రోజు ఒక విధమైన బ్రేక్ ఫాస్ట్ రిసిపిలను తిని బోరుకొడుతుంటే, వైటీగా , చాలా సింపుల్ గా రెడీ అయ్యే ఇటువంటి సింపుల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Dates Pancake-Healthy Breakfast Recipe

కావలసిన పదార్థాలు:
ఖర్జూరం(గింజ లేనివి): 50grm
స్ప్రింగ్ రోల్ షీట్: 10
కొబ్బరిపాలు: 15ml
రిఫైన్డ్ ఆయిల్: తగినంత
తేనె: 1tsp
కిస్‌మిస్: 10grm
వాల్‌నట్స్: 25grm

తయారుచేయు విధానం:

1. ముందుగా ఖర్జూరాలను సన్నగా తరగాలి. దీంట్లో వాల్‌నట్స్‌ను క్రష్ చేసి కలపాలి.

2. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్‌ని ఫ్లాట్‌గా పరిచి, ఖర్జూరాల మిశ్రమం వెడల్పుగా సర్దాలి.

3. స్క్వేర్ షేప్‌లో షీట్‌ను మడవాలి.

4. ఇప్పుడు వేయించడానికి తగినంత నూనె కడాయిలో పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న పాన్‌కేక్‌లను కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా వేయించి తీయాలి.

5. ఇప్పుడు చాకుతో త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి.

6. తేనె, కిస్‌మిస్, కొబ్బరి, క్రీమ్, సాస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

నోట్: కావలసినన్ని డ్రై నట్స్, డేట్స్ మిక్స్చర్‌ని ఉపయోగించుకోవచ్చు.

English summary

Dates Pancake-Healthy Breakfast Recipe


 Dates are full of iron and zinc and a great low-calorie ingredient for desserts. Here they combine with nuts and spices to make a delicious stuffing.This dessert is excellent as it is nutritious and delicious. It can be made richer by drizzling honey over warm pancake.
Story first published: Monday, August 19, 2013, 11:06 [IST]
Desktop Bottom Promotion