For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర పొంగల్ : పొంగల్ స్పెషల్ రిసిపి

|

పొంగల్ అనేది సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకొనే ఒక పెద్ద పండుగ. నార్త్ ఇండియాలో ఈ పండుగను మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ పర్వదినానా ఒక వెరైటీ స్పెషల్ ఫుడ్ ను తయారుచేసుకుంటారు మరియు పొంగల్ చాలా సాధారణ రిసిపి.

పొంగల్ రిసిపిని స్వీట్ గా లేదా సావరీగా తయారుచేసుకోవచ్చు. కారం పొంగలి సెమీ లిక్విడ్ పొంగల్. దీన్ని బియ్యం పెసరపప్పుతో వండుతారు. పొంగల్ అంటే స్వీట్ పొంగల్ మరియు కారం పొంగల్ రెండు వండుతారు. కారం పొంగలి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిపిలలో చాలా ఫేమస్. తయారు చేయడం కూడా సులభం మరియు చాలా సింపుల్ రిసిపి. కారం పొంగల్ లాగే ఈ చెక్కర్ పొంగల్ కూడా చాలా సింపుల్ గా, త్వరగా తయారుచేయవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఇంట్లోనూ ఈ స్వీట్ పొంగల్ పొంగాల్సింది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

e paristhithi evvariki rakudadhu please

కావల్సిన పదార్థాలు:
చిన్న బియ్యం: 1/2cup(సోనామసూరి రైస్)
పెసరపప్పు: 1/4cup
బెల్లం తురుము: 1/2cup
నీళ్ళు: 4cup
నెయ్యి: 3tbsp
ఎండుద్రాక్ష: 12-15
జీడిపప్పు: 8-15
యాలకలు: 2(పొడి చేసుకోవాలి)
లవంగాలు: 2(పొడి చేసుకోవాలి)
తినేటటువంటి కర్పూరం: చిటికెడు

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ పాన్ లో ఒక చెంచా నెయ్యి వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత అందులో కడిగి పెట్టుకొన్న బియ్యం మరియు సరిపడా నీళ్ళు పోయాలి.
4. మూడు విజిల్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వాటిలో (మొదట విజిల్ మంట ఎక్కువగా పెట్టి, తర్వాత రెండు విజిల్ వచ్చేందుకు మీడియం మంటను పెట్టుకోవాలి)
5. అంతలోపు, మరో పాన్ లో బెల్లం తురుము ఒక కప్పు నీరు పోసి బెల్లం కరిగే వరకూ ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
6. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి బియ్యం, పప్పు మిశ్రమంలో బెల్లం మిశ్రమాన్ని వేయాలి.
7. అలాగే వీటితో పాటు, యాలకులు, లవంగాలు మరియు కర్పూరం వేసి బాగా మిక్స్ చేయాలి.
8. మిక్స్ చేస్తూ మరో 3, 4 నిముషాలు ఉడికించుకోవాలి.
9. ఇప్పుడు మిగిలిన నెయ్యిని పాన్ లో వేసి వేడి చేసి, అందులో జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత వీటిని స్వీట్ పొంగల్లో వేయాలి.
10. అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసి వేగించుకోవాలి. బాగా మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చెక్కర పొంగల్ రెడీ.

English summary

e paristhithi evvariki rakudadhu please

Pongal is a festival celebrated in South India as a festival of harvest. In North India, it is celebrated as Makar Sankranti. On this day, a variety of special food is made and Pongal is the most common.
Story first published: Thursday, January 9, 2014, 16:59 [IST]
Desktop Bottom Promotion