For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా ఎగ్ కర్రీ: వెరీ సింపుల్ అండ్ ఈజీ

|

సాధారణంగా గుడ్లతో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. ముఖ్యంగా గుడ్డుతో తయారుచేసే వంటలను రోజులో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్, మీల్ , డిన్నర్ ఇలా ఎప్పుడైనా తినవచ్చు . గుడ్డును పగులగొట్టి, ఎగ్ బుర్జు, ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ తయారుచేసుకుంటాము. అలాగే ఉడికించిన గుడ్డుతో వివిధ రకాల వంటలను కూడా తయారుచేస్తారు.

అందుకే వంటల్లో గుడ్డుతో తయారుచేసే వంటలు ఒక సూపర్ డిష్ గా ఉంటుంది. ఉడికించిన గుడ్లును ఫ్రై చేసి, వివిధ రకాల మాసాలా దినుసుల పేస్ట్ తో చిక్కటి గ్రేవి తయారుచేసి అందులో గుడ్లను జోడించి తయారుచేసి ఈ ఎగ్ మసాల కర్రీ చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy To Make Masala Egg Curry: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
బాయిల్డ్ ఎగ్స్: 4 ( సగానికి కట్ చేసుకోవాలి )
టమోటోలు : 2
ఉల్లిపాయలు: 2
కారం: 1 tsp
కొబ్బరి తురుము : 1 cup
దాల్చిన చెక్క: 1 stick
లవంగాలు: 2
యాలకలు : 2 to 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 tbsp
ధనియాలపొడి : 1 tbsp
ఉప్పు:రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక జార్ లో టమోటో, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, మరియు కొన్ని నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .
2. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో మిక్సీలే మెత్తగా చేసుకొన్న మసాలా పేస్ట్ ను వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. మసాలాతో పాటు, కారం, కొద్దిగా ధనియాలపొడి, ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
5. మసాలా పచ్చివాసన పోయి, బాగా వేగిన తర్వాత ఉడికించిపెట్టుకొన్న గుడ్లను రెండుబాగాలుగా కట్ చేసి వేగుతున్న మసాలాలో వేసి మిక్స్ చేస్తూ , తక్కువ మంట మీద 5నుండి 10 నిముషాలు ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఎగ్ మసాల రెడీ..

English summary

Easy To Make Masala Egg Curry: Telugu Vantalu

Easy To Make Masala Egg Curry: Telugu Vantalu, If you are wondering what to cook as a gravy for chapati and roti here is a simple recipe that is easy to prepare, fast to cook, tasty and less time consuming.Egg curry is a very simple dish.
Story first published: Monday, August 10, 2015, 15:20 [IST]
Desktop Bottom Promotion