For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు,పెద్దలు అందరికీ ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ఎగ్ చీజ్ రోల్స్

|

ఉదయం అల్పాహారంతో దినచర్యను పాటించేటప్పుడు ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గుడ్డు. ఆరోగ్యకరమైన ఆహారంలో పోషకాలు, మినిరల్స్ , విటమిన్స్, సహజ శక్తులు పుష్కంగా ఉండి, ఆరోజంతా మీకు కావల్సిన ఎనర్జీని, ఉత్సాహాన్ని అంధిస్తాయి. గుడ్డు అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి చాలా ఇష్టం. ఈ హెల్తీ ఆహారంతో పాటు డైరీప్రొడక్ట్ అయిన చీజ్ ను కూడా మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే మరింత శక్తిని అంధిస్తుంది.

ఈ ఉదయం బోల్డ్ స్కై మీకోసం ఒక అద్భుతమైన రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మీకు అందిస్తోంది. దీన్ని తయారుచేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మరియు అన్ని బ్రేక్ ఫాస్ట్ లలో కంటే రుచిగా, హెల్తీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని ఎలా తయారు చేయాలి చూద్దాం...

Egg Cheese Roll Recipe For Healthy Breakfast

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 2(ఒక గిన్నెలో వేసి బాగా బీట్ చేయాలి)
చీజ్: 8స్లైస్
బ్రెడ్: 8స్లైస్
ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
కార్న్ ఫ్లోర్: 2tbsp
అల్లం: చిన్న ముక్క(తురుము కోవాలి)
కారం: 1/2tsp
ఛాట్ మసాలా: 1/2tsp
బటర్: 1tbsp
నూనె: 2tbsp
లెట్యూస్ లీవ్స్: 4ఆకులు

తయారుచేయు విధానం:
1. ముందుగా , వంటను మొదలు పెట్టడానికి ముందే లెట్యూస్ ఆకులకు కొద్దిగా బటర్ రాసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో, గుడ్డు పగులగొట్టి వేసి, బాగా బీట్ చేయాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, మరియు అల్లం తురుము వేయాలి.
3. గుడ్డు మిశ్రమంతో పాటు, వీటన్నింటినీ బాగా గిలకొట్టాలి . ఇప్పుడు అందులో ఛాట్ మసాలా కూడా వేసి మరో సారి బాగా మిక్స్ చేయాలి.
4. బాగా గిలకొట్టడం వల్ల బాగా చిక్కగా మారుతుంది . చిక్కగా మిశ్రం తయారైన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు,మరో బౌల్ తీసుకొని అందులో కార్న్ ప్లోర్ వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి.
6. తర్వాత బ్రెడ్స్ స్లైస్ ను తీసుకొని వాటి మీద ఒక్కో చీజ్ స్లైస్ పెట్టాలి.
7. బ్రెడ్ కు చీజ్ రాసిన తర్వాత , దాని మీద ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్ని గుడ్డు మిశ్రమాన్ని అమర్చాలి. తర్వాత చిక్కగా కలుపుకొన్న కార్న్ ఫ్లోర్ తో బ్రెడ్ అంచులను కవర్ చేస్తూ రోల్ చేయాలి.
8. ఇలా అన్ని బ్రెడ్ స్లైస్ మరియు అన్ని చీజ్ స్లైతో అన్ని రోల్స్ చేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి. తర్వత బ్రెడ్ రోల్స్ ను పాన్ మీద వేసి మీడియం మంట మీద బ్రెడ్ రోల్స్ ను ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
10. ఇలా తయారైన తర్వాత వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద వేయాలి.
11. ఈ బట్టర్ లెట్యూస్ ఆకులను మరో సైడ్ వాటి మీ పెట్టాలి. అంతే రుచికరమైన ఎగ్ రోల్స్ తినడానికి రెడీ. వేడి గా ఉన్నప్పుడు తింటేనే మరింత రుచికరంగా ఉంటాయి . ఈ ఎగ్ చీజ్ రోల్స్ ను టమోటో సాస్ లేదా గ్రీన్ చట్నీత హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ముంగించేయండి...

English summary

Egg Cheese Roll Recipe For Healthy Breakfast

One of the healthiest ingredients you can start of your day with is egg. This healthy food contains a lot of natural energy to keep you fit throughout the day. Egg is a dairy product which is generally loved by kids of all ages. To go with this healthy ingredient is cheese, another dairy product which provides you with energy.
Story first published: Thursday, November 21, 2013, 19:49 [IST]
Desktop Bottom Promotion