For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ వెర్మిసెల్లీ రిసిపి - బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

ఈ రోజు ఉదయం మీకోసం ఒక సలభయైన వంటను మీకు అంధిస్తున్నాం. సులభం మాత్రమే కాదు, చాలా సింపుల్ గా, అతి త్వరగా రెడీ అవుతుంది. రోజును ఆరోగ్యకంగా మొదల పెట్టాలనుకుంటే ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకోవాల్సిందే. ఈ బ్రేక్ ఫాస్ట్ యొక్క ప్రత్యేకత ఈ రోజంతా మీకు కావల్సిన ఎనర్జీని అందిస్తుంది.

ఎగ్ వెర్మిసెల్లి ఎలా తయారుచేయాలిని మీకు ఆశ్చర్యం కలిగవచ్చు . అందుకే మీకోసం ఈ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఎలా తయారుచేయాలో మీకు అందిస్తున్నాం . మరో ముఖ్య విషయం వర్మిసెల్లీ, ఎగ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారుచేసిన వెంటనే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. మరి ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఎలా తయారుచేయాల చూద్దాం...

Egg Vermicelli Recipe For Breakfast

కావల్సిన పదార్థాలు:
గుడ్లు : 2 (పరాజయం)
సేమియా : 500 gms
ఉల్లిపాయలు : 2 (చిన్న ముక్కలుగా తరిగి)
ఆవాలు : 1 టేబుల్ స్పూన్
శెనగ : 20 గ్రాముల
కరివేపాకు : కొన్ని
వెన్న : 3 టేబుల్ స్పూన్లు
ధనియాలు : 1tsp
జీలకర్ర : 1 స్పూన్
ఎండు మిర్చి: 2
చెక్క : 2 చిన్న ముక్కలు
యాలకులు: 2
నూనె/నెయ్యి: వేగించడానికి
నీళ్ళు : 1 cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా శుభ్రంగా ఉన్న గిన్నె తీసుకొని, అందులో ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, చెక్క, యాలాకలు వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీల వేసి అన్నింటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
2. తర్వతా పాన్ స్టౌమీ పెట్టి, పాన్ వేడవ్వగానే, అందులో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో సేమియాలను వేయాలి.
3. మంట మీడియంగా పెట్టి సేమియాలను వేగించుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. సేమియాలు రోస్ట్ అయిన వెంటనే వాటిని ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. తిరిగి అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, శెనగపప్పు, ఉప్పు, కరివేపాకు, వేసి, వేగిన తర్వాత అందుల గుడ్డు కూడ వేసి, వెంటనే ముందుగా పొడి చేసి పెట్టుకన్న దాన్ని కూడా వేసి బాగా వేగించాలి.
6. ఇప్పుడు అందులోనే వేగించన సేమియా కూడా వేసి , ఒకనిముషం వాటితో మిక్స్ చేసి తర్వతఅందులో నీళ్ళు పోయాలి .
7. ఇప్పుడు మంట కొద్దిగా ఎక్కువ పెట్టి పదార్థాలన్ని బాగా ఉడకనివ్వాలి. సేమియా కొద్దిగా మెత్తగా ఉడకడం మెదలవగానే మంట తగ్గించి , సేమియా మెత్తబడే వరకూ వేగిస్తూ ఉడికించాలి. అంతే ఎగ్ వర్మిసెల్లీ రెడీ ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మీరు టమోటో సాస్ తో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

English summary

Egg Vermicelli Recipe For Breakfast

This morning, one of the best and easiest recipes we would like for you to try is the Egg Vermicelli. For those of you who love to start off your day on a healthy note, this is one recipe you can try out.
Story first published: Saturday, November 23, 2013, 7:01 [IST]
Desktop Bottom Promotion