For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోబీ మటర్ ఫ్రై: హెల్తీ సైడ్ డిష్ రిసిపి

|

కాలీఫ్లవర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఇది ఇండియన్ కుషన్స్ లో ఒక సీజనల్ వెజిటేబుల్. కాలీఫ్లవర్ ను ఉపయోగించి వివిధ రకాల వంటలను తయారుచేస్తారు. హిందిలో కాలీఫ్లర్ ను గోబి అని పిలుస్తారు. కాలీఫ్లవర్ ఒక హార్ట్ హెల్తీ ఫ్లవర్ వెజిటేబుల్.

కాలీఫ్లవర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాలీఫ్లవర్ లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్, మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు వ్యాధులను దూరంగా ఉంచతుంది. గోబి ఒక రుచికరమైన మరియు హెల్తీ వెజిటేబుల్, ఇది వంట యక్క రుచిని అద్భుతంగా మార్చుతుంది. మరి కాలీఫ్లవర్ తో వెంటనే మీరు ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు ఈ గోబి మటర్ రిసిపిని ఎంపిక చేసుకోండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Gobi Matar Fry:Healthy Side Dish

కావల్సిన పదార్థాలు:
గోబి(కాలీఫ్లవర్): 250gms(పువ్వులను విడిపించుకోవాలి)
మట్టర్(పచ్చిబఠానీలు) : 100gms
పచ్చిమిర్చి: 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాలపొడి: 1/2tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా విడిపించి పెట్టుకొన్న కాలీఫ్లవర్ పువ్వులను వేడి నీళ్ళలో వేసి 20-25నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా నివారిస్తుంది. మరీ ముఖ్యంగా కాలీఫ్లవర్ పువ్వులను వేడి నీళ్ళలో నానబెట్టుట వల్ల వండటానికి కూడా సులభం అవుతుంది.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత వేడినీళ్ళు వంపేసి కాలీఫ్లవర్ పువ్వులను మాత్రం అందులో వేసి మీడియం మంట మీద 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. కాలీఫ్లవర్ వేగుతున్నప్పుడే , అందులో పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేస్తూ వేగించడం వల్ల చాలా త్వరగా మరియు సులభంగా ఉడుకుతుంది.
5. ఒక పదినిముషాలు గోబీ ఫ్రై అయ్యి, గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారేవరకూ ఫ్రై చేసుకోవాలి.
6. కాలీఫ్లవర్ బ్రౌన్ కలర్ కు మారుతున్నప్పుడుఅందులో పచ్చిబఠానీలు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి, మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, మరియు ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు ఉడికించి స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే గోబీ మట్టర్ సైడ్ డిష్ రెడీ...ఈ క్రిస్పీ ఇండియన్ సైడ్ డిష్ ను వేడి వేడిగా వడ్డించాలి.

English summary

Gobi Matar Fry:Healthy Side Dish

Cauliflower has numerous health benefits. Gobi contains carotenoids, such as beta-carotene, and phytonutrients which prevents free radical damage and also keeps diseases at bay. Gobi is one of the delicious and healthy vegetables which can change the taste of the dish.
Story first published: Wednesday, November 26, 2014, 18:00 [IST]
Desktop Bottom Promotion